పోలీస్‌స్టేషన్‌కు రమ్మని పిలిచి..

14 Nov, 2018 08:49 IST|Sakshi
 నిరసన తెలుపుతున్న బాధితుడి కుటుంబం బాధితుడు శ్రీను

అనంతగిరి (కోదాడ) : భూ వివాదంపై ఓ వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఎస్‌ఐ చితకబాదాడు. ఈ ఘటన అనంతగిరిలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గంధం శ్రీనుకు తన తల్లి, చెల్లెలుతో జరుగుతున్న భూ వివాదాన్ని పరిష్కరించాలని ఎస్పీ అనంతగిరి ఎస్‌ఐని ఆదేశించారు. ఈ మేరకు ఎస్‌ఐ రామాంజనేయులు గంధం శ్రీనుని ఫోన్లో సంప్రదించి స్టేషన్‌కు రావాలంటూ ఆదేశించాడు. దీంతో శ్రీను న కొడుకు మనోహర్‌తో కలిసి మంగళవారం రాత్రి ఎడున్నర గంటల సమయంలో స్టేషన్‌కు వెళ్లాడు.

లోపలికి వెళ్లగానే..
స్టేషన్‌ లోపలికి వెళ్లగానే ఎస్‌ఐ తనపై దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. దుర్భాషలాడుతూ సిబ్బందితో కలిసి చిత్రహింసలు పెట్టారని తెలిపా డు. చివరకు బూటుకాలిని నాకించి అవమానానికి గురిచేశాడని కన్నీటి పర్యంతమయ్యాడు.

న్యాయం చేయాలని..
తనపై దాడి చేసిన పోలీసులపై చర్య తీసుకుని న్యా యం చేయాలని కోరుతూ బాధితుడు శ్రీను కుటుంబంతో సహా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయిం చాడు. సివిల్‌ కేసును కో ర్టుకు పంపకుండా అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించాడు. ఎస్‌ఐ రామాంజనేయులు తీరుతో తనకు ప్రాణ హాని ఉన్నదని పై న్యాయం చేయాలని వేడుకున్నారు.

దాడి చేయలేదు : ఎస్‌ఐ
గంధం శ్రీనుపై తాము దాడి చేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎస్‌ఐ రామాంజనేయు తెలిపారు.శ్రీనుపై విచారణ చేపట్టాలంటూ ఎస్పీ  ఆదేశాల మేరకు అతడిని పిలిపించామని తెలి పా రు. అతని సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు  విచా రించామని, ఆకేసు నుంచి తప్పించుకునేందుకే తప్పుడు ఆనోపణలు చేస్తున్నాడన్నారు. అనుమతి లేకుండా స్టేషన్‌ ఎదుట ఆందోళన చేసినందుకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు