అగ్ని ప్రమాదం.. 15 మంది చిన్నారుల మృతి

15 Feb, 2020 08:24 IST|Sakshi

పోర్ట్‌ అవు ప్రిన్స్‌ : కరీబియన్‌ దేశం హైతీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న వసతి గృహం మంటల్లో కాలిపోయింది. రాజధాని పోర్ట్‌ అవు ప్రిన్స్‌లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందిని అగ్నిమాపక దళాలు రక్షించగలిగాయి. ప్రమాదానికి గురైంది అమెరికాకు చెందిన క్రైస్తవ మత ఎన్జీవో ‘బైబిల్‌ అండర్‌స్టాండింగ్‌’ అనాథశరణాలయంగా తెలిసింది. హైతీలో రెండు అనాథ శరణాలయాను నిర్వహిస్తున్న సదరు ఎన్జీవో 150 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక అగ్ని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన హైతీ అధ్యక్షుడు జోవినల్‌ మాయిజ్‌.. దర్యాప్తునకు ఆదేశించారు. వెలుగుతున్న క్యాండిల్‌ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

మరిన్ని వార్తలు