ఏసీబీకి చిక్కిన లైన్‌మెన్‌

10 Sep, 2019 13:44 IST|Sakshi
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన లైన్‌మెన్‌ కాశీరాం

సాక్షి, రంగారెడ్డి : గృహ వినియోగ విద్యుత్‌ మీటర్‌ కోసం లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు లైన్‌మెన్‌ చిక్కాడు. పెద్దషాపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని తొండుపల్లి, ఊట్‌పల్లి, చౌదరిగూడ లైన్‌మెన్‌గా కాశీరాం పనిచేస్తున్నాడు. ఊట్‌పల్లి పరిధిలోని సదరన్‌ వెంచర్‌లో ఇంటిని నిర్మించుకుంటున్న తిరుపతిరెడ్డికి గృహ వినియోగ విద్యుత్‌ మీటర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ పనికోసం లైన్‌మెన్‌ రూ.40 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. తాను డబ్బులు ఇవ్వలేనని తిరుపతిరెడ్డి చెప్పడంతో లైన్‌మెన్‌ మీటర్‌ బిగించకుండా ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో తిరుపతిరెడ్డి ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఒప్పందం మేరకు ఇటీవల రూ.20 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ సమాచారాన్ని ఏసీబీకి తెలపడంతో సోమవారం ఆ నగదు కాశీరాంకు ఇస్తుండగా అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.  ఏసీపీబీ డీఎస్‌పీ సూర్యనారాయణ, సీఐలు మాజీద్‌ అలీ, నాగేందర్‌గౌడ్‌ కేసు దర్యాప్తు చేపడుతున్నారు. కాశీరాం గతంలో పనిచేసిన శంషాబాద్, పాలమాకుల పరిధిలో కూడా అనేకమంది గృహ, పారిశ్రామిక యజమానులకు లంచాల కోసం ఇబ్బందులు పెట్టేవాడని ఆరోపణలు ఉన్నాయి.  

 

 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌.. తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు

లాక్‌డౌన్‌ : మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

ప్రేమ పేరుతో ఎన్‌ఆర్‌ఐ వేధింపులు

కరోనా భయం: వరుస ఆత్మహత్యలు

డాక్ట‌ర్ల‌పై ఉమ్మివేసిన‌వారి అరెస్ట్‌

సినిమా

చేతులెత్తి నమస్కరిస్తున్నా : బాలకృష్ణ

ప్ర‌ధానిని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తిన రంగోలీ

బిగుతు దుస్తులు వ‌ద్ద‌న్నారు: ప‌్రియాంక‌

కరోనా : బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌

విడాకులకు సిద్దంగానే ఉన్నావా అని అడిగారు..

సీసీసీకి టాలీవుడ్‌ డైరెక్టర్‌ విరాళం..