మంత్రి కొడుకు కారు అడ్డగింపు.. మహిళా పోలీస్‌ను

13 Jul, 2020 10:07 IST|Sakshi

గాంధీనగర్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి కర్ఫ్యూ సమయంలో ప్రయాణిస్తున్న మంత్రి కొడుకు కారును అడ్డగించినందుకు మహిళా పోలీసు అధికారిని బదిలీ చేశారు. ఈ ఉదంతం గుజరాత్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూరత్‌లో కర్ఫ్యూ అమలులో ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి కుమార్‌ కనాని కొడుకు ప్రకాశ్‌ కనాని స్నేహితులు బుధవారం లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించి కారుతో రోడ్డుపైకెక్కారు. మాస్క్‌ ధరించకుండా కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చినందుకు వారి కారును మహిళా కానిస్టేబుల్‌ సునీతా యాదవ్‌ అడ్డుకుది. దీంతో వారు ఎమ్మెల్యే కొడుకు ప్రకాశ్‌ను రప్పించారు. (టీచర్‌ నిర్వాకంపై తీవ్ర విమర్శలు)

అనంతరం మరో కారులో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొడుకు, అతని స్నేహితులతో కలిసి మహిళా కానిస్టేబుల్‌తో గొడవకు దిగారు. కానిస్టేబుల్‌ను అనుచిత వ్యాఖ్యలతో దూషించి, తమతో పెట్టుకుంటే ఆమెను 365 రోజులు అదే రోడ్డుపై నిలబెట్టేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన కానిస్టేబుల్‌ ఆమె తమకు బానిసను కాదని బదులిచ్చారు. కాగా రాజకీయ ప్రోద్భలంతో అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను మరో చోటుకు బదిలీ చేశారు. కాగా ఈ సంభాషణకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవ్వడంతో  ఈ సంఘటనపై సూరత్‌ పోలీస్‌​ కమిషనర్‌ విచారణకు ఆదేశించారు. అంతేగాక ప్రకాశ్‌ కనాని, అతని ఇద్దరు స్నేహితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.  (ఫోటోగ్రఫీ ‘పిచ్చి’ : చివరికి కొడుకులకు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా