గ్రేట్‌ చీటర్‌!

18 Apr, 2018 10:40 IST|Sakshi
నిందితుడు అఫ్తాబ్‌ అహ్మద్‌

మోసాలు చేయడంలో దిట్ట అఫ్తాబ్‌ అహ్మద్‌  

ఒక్కోసారి ఒక్కో పంథాలో టోకరా  

ఈసారి టార్గెట్‌గా నిజామాబాద్‌ కమిషనరేట్‌

గడిచిన 40 రోజుల్లో ఐదు నేరాలు

చాకచక్యంగా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

సొత్తుతో సహా పోలీసులకు అప్పగింత

సాక్షి, సిటీబ్యూరో: ఒక్కోసారి ఒక్కో ప్రాంతం... మోసాలు చేయడానికి మా త్రం ఒకే పంథా... 2006 నుంచి రెండు రాష్ట్రాల్లో నేరాలు... జైలు నుంచి బయటకు వచ్చి మళ్లీ మొదలు... నిజామా బాద్‌ కమిషనరేట్‌ టార్గెట్‌గా ఐదు చీటింగ్స్‌... ఇలాంటి ‘ఘన చరిత్ర’ కలిగిన కరుడుగట్టిన మోసగాడు అఫ్తాబ్‌ అహ్మద్‌ షేక్‌. నిజామాబాద్‌ అధికారులను ముప్పతిప్ప లు పెట్టిన ఇతడిని నగర సౌత్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. సొత్తుతో సహా ఆదివారం అక్కడి అధికారులకు అప్పగించారు.

పానీపూరీ వ్యాపారే తొలి టార్గెట్‌...
మహారాష్ట్రలోని బీడ్‌ ప్రాంతానికి చెందిన అఫ్తాబ్‌ 2006లో తొలినేరం చేశాడు.  నర్సి ప్రాంతంలోని పానీపూరీ బండి నిర్వాహకుడికి టోపీ పెట్టాడు. ఓ రోజు అతను నర్సి ఠాణా ఎదురుగా పానీపూరీ వ్యాపారి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో సదరు చిరు వ్యాపారి తన స్టౌల్‌లో కిరోసిన్‌ పోసుకుంటున్నాడు. ‘అంత ఖర్చుపెట్టి గ్యాస్‌నూనె ఎందుకు వాడతావు? కట్టెల పొయ్యి వెలిగించుకోవచ్చు కదా?’ అంటూ అతడికి  సలహా ఇచ్చాడు. కట్టెలు దొరకడం కష్టంగా ఉందంటూ పానీపూరీ వాలా చెప్పగా... ఎదురుగా ఉన్న పోలీసుస్టేషన్‌లోని చెట్టును చూపించిన అఫ్తాబ్‌ దాన్ని కొట్టుకోమని, ఇప్పుడే పోలీసులతో మాట్లాడతానని చెప్పాడు. 

పానీపూరీ ఇప్పించమంటూ...
పానీపూరీ వ్యాపారి చూస్తుండగానే సదరు ఠాణా సెంట్రీ వద్దకు వెళ/Šæళన అఫ్తాబ్‌ తనకు ఆకలిగా ఉందని, డబ్బులు లేవణ/æ చెప్పాడు. మీరు ఇవ్వమంటే సదరు చిరు వ్యాపారి పానీపూరీలు ఇస్తాడని వేడుఖక్షశఢఃథక్ష జాలిపడిన సెంట్రీ అఫ్తాబ్‌కు ఓ ప్లేట్‌ పానీపూరీ ఇవ్వమని పానీపూరీ వ్యాపారికి సైగ చేశాడు. అనంతరం సదరు వ్యాపారి వద్దకు వెళ్లిన అఫ్తాబ్‌... పోలీసులు చెట్టు కొట్టుకునేందుకు అనుమతిచ్చినందున ‘ఖర్చుల’ పేరుతో రూ.1000 తీసుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజు పానీపూరీ వ్యాపారి చెట్టు కొట్టేందుకు ఠాణా లోకి వెళుతుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో అఫ్తాబ్‌ చేసిన మోసం బయటపడి వదిలేశారు. 

అరటి పళ్ల వ్యాపారం పేరుతో...
అఫ్తాబ్‌ స్వస్థలమైన బీడ్‌లో అరటి పంట ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీటికి అంతగా డిమాండ్‌ లేకపోవడంతో వ్యాపారం నిమిత్తం 2007లో హైదరాబాద్‌కు వచ్చాడు. పాతబస్తీలోని రెయిన్‌బజార్‌లో స్థిరపడిన ఇతను అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అరటి పండ్ల వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో మోసగాడిగా మారాడు. గతంలో పేట్‌బషీరాబాద్, వనస్థలిపురం, మీర్‌పేట, మొఘల్‌పుర, మలక్‌పేట, గోల్కొండ, ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్, కామారెడ్డి, దేవన్‌పల్లిల్లో నేరాలు చేసి అరెస్టయ్యాడు. 2011లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ అత్యాచారం కేసులో అరెస్టై 2017 వరకు జైలు జీవితం అనుభవించాడు. గత జనవరిలో జైలు నుంచి వచ్చిన ఇతను గత నెల నుంచి మళ్ళీ మోసాలు ప్రారంభించాడు. ఈసారి నిజామాబాద్‌ కమిషనరేట్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ మోసాలు చేయడం కోసం ఓ వాహనం అవసరం కావడంతో గుల్బర్గా వెళ్లాడు.

ఇన్‌స్టాల్‌మెంట్‌ జాబితాతో...
చోరీ వాహనంతో నిజామాబాద్‌ చేరుకున్న అఫ్తాబ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లా తయారై షోరూం యజమానిని మాటలతో బోల్తాకొట్టించి అతని వద్ద ఇన్‌స్టాల్‌మెంట్‌లో గృహోపకరణాలు కొన్న వారి జాబితా సేకరించాడు. దీని ఆధారంగా మధ్య వయస్కులైన మహిళా వినియోగదారుల ఇళ్లకు వెళ్లి షోరూం తీసిన డ్రాలో మీకు 5 తులాల బంగారం తగిలిందని చెప్పేవాడు. అది తీసుకోవడానికి రావాలంటూ  తన వాహనంపై ఎక్కమనేవాడు. మీ ఒంటిపై బంగారం ఉంటే షోరూమ్‌ వారు బంగారం ఇవ్వరని చెప్పి ఆ సొత్తును ఇంట్లో ఉన్న వారికి అప్పగించేలా చేసేవాడు. ఆపై టార్గెట్‌ను కొంతదూరం తన వాహనంపై తీసుకువెళ్ళి దింపేవాడు. వెనక్కు వెళ్లి తనతో పాటు వచ్చిన మహిళకు చెందిన బంగారం ఇవ్వమంటోందంటూ ఇంట్లో వారికి చెప్పి అది తీసుకుని ఉడాయించేవాడు. 40 రోజుల్లో ఈ పంథాలో ఐదు నేరాలు చేశాడు. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి 18 తులాల బంగారం, వాహనం రికవరీ చేసి నిజామాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

లాటరీలో వాహనంతగిలిందంటూ...
అక్కడ ఓ డిగ్రీ విద్యార్థిని టార్గెట్‌గా చేసుకున్న అఫ్తాబ్‌ అతడి వద్దకు వెళ్లి తానో సంస్థ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. మాటలతో బురిడీ కొట్టించి లాటరీలో బైక్‌ వచ్చిందంటూ ఆ స్టూడెంట్‌ వాహనంపైనే షో రూం వద్దకు తీసుకెళ్లాడు. విద్యార్థిని బయటే ఉంచి.. లోపలకు వెళ్లిన అఫ్తాబ్‌ బైక్‌ కొంటానంటూ నిర్వాహకులకు చెప్పి ఓ మోడల్‌ ఎంపిక చేసుకున్నాడు. తన బంధువుకు చూపిస్తానంటూ దానిని బయటికి తీసుకువచ్చి ఇదే నీకు లాటరీలో వచ్చిన వాహనంగా చెప్పాడు. అందుకు అవసరమైన పత్రాలు తెస్తానని సదరు విద్యార్థి బండితో పాటు ఖర్చుల కోసం రూ.వెయ్యి తీసుకుని నేరుగా నిజామాబాద్‌ వచ్చేశాడు. దీంతో బాధితుడి పోలీసులను ఆశ్రయించాడు.

మరిన్ని వార్తలు