ఆలయంలో పాడుపని

4 Oct, 2018 11:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గ్రామస్తులకు దొరికిన యువజంట

కర్ణాటక, మైసూరు: పవిత్రమైన దేవాలయాన్ని ఓ ప్రేమ జంట శృంగారానికి అడ్డాగా చేసుకుంది. కొన్నిరోజులుగా సాగుతున్న ఈ తంతు చివరకు గ్రామస్తుల చొరవతో బయటపడింది. ఈ సంఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలో చోటు చేసుకుంది. కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమలో మునిగారు. రోజూ దేవాలయం మూసి ఉన్న సమయంలో బైక్‌పై చేరుకునేవారు. మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని గ్రామస్తులు భావించారు.

కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో బుధవారం అనుమానంతో ఆ దేవాలయానికి దారితీశారు. అప్పటికే ఆ యువజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది. గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా యువజంట శృంగారంలో తలమునకలయ్యారు. కొద్దిసేపటికి గ్రామస్థులు తమను గమనిస్తున్నట్లు తెలుసుకున్న యువజోడి వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి యత్నించగా పట్టుకుని ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు. కొందరు ఈ వ్యవహారాన్ని మొబైల్‌ఫోన్లలో బంధించడం గమనార్హం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు