అబ్బాయి మేజర్‌.. అమ్మాయి మైనర్‌

11 Feb, 2019 11:48 IST|Sakshi
లోకేష్, వన్నూరక్క (ఫైల్‌ ఫొటోలు)

అబ్బాయి మేజర్‌.. అమ్మాయి మైనర్‌. అయినా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లికి ‘వయసు’ అడ్డొచ్చింది. పెద్దలు కాదన్నారు. కొన్నాళ్లు వేచి ఉంటే సరిపోయేది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన జంట క్షణికావేశంలో నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం అలుముకుంది.

అనంతపురం, కళ్యాణదుర్గం: పాలవాయి గ్రామంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన లోకేష్‌ (22), వన్నూరక్క (16) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. చిన్న వయసులోనే ప్రేమ ఏమిటంటూ తల్లిదండ్రులు సున్నితంగా మందలించారు. ఆలోచనలో పరిపక్వత లేని ఇద్దరూ మనస్తాపానికి గురయ్యారు. పెళ్లికి వయస్సు అడ్డు వస్తోందని, మనల్ని ఇక కలవనీయరని, అలా ఉండటం కన్నా చావడమే మేలనుకున్నారు. గ్రామంలో ఆంజనేయ స్వామి గుడికి వెళ్తానని వన్నూరక్క కుటుంబ సభ్యులకు చెప్పి శనివారం సాయంత్రం బయటకు వెళ్లింది. లోకేష్‌ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇద్దరూ ద్విచక్రవాహనంలో గ్రామ సమీపంలోని బంతి ఓబిలేసు గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ వేప చెట్టుకు చున్నీలతో ఇద్దరూ ఉరేసుకున్నారు. ద్విచక్ర వాహనంపైకి ఎక్కి ఉరి వేసుకుని వేలాడినట్లు కనిపిస్తోంది. 

సంఘటన స్థలంలో ప్రేమజంట లోకేష్, వన్నూరక్క మృతదేహాలు 
పారిపోయి.. విగతజీవులుగా మారి!
ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు లోకేష్, వన్నూరక్క మృతదేహాలను చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు. రాత్రి వేళలో ఇంటికి రాకపోవడంతో ఇరువురు కుటుంబ సభ్యులు సెల్‌ఫోన్లకు ఫోన్‌ చేసినా పనిచేయలేదు. బంధువుల గ్రామాలలోనూ ఆరా తీశారు. పాలవాయి సమీపంలోనూ అన్వేషించారు. ఎక్కడా ఆచూకీ లభించలేదు. పెళ్లి చేసుకోవడం కోసం పారిపోయి ఉంటారని భావించారు.  

పెళ్లి చేద్దామనుకునే లోపే..
ఉదయాన్నే ఇరు కుటుంబాల బంధువులు వారి వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి చర్చలు జరిపారు. ఒకే కులానికి చెందిన వారని, అందులోనూ బంధుత్వం ఉందని, పిల్లల మనసును ఎందుకు కష్టపెట్టడం పెళ్లి చేసేద్దాం.. ఎట్లయ్యేది అట్ల అవుతుంది. అంతా దేవుడిమీదే భారం వేద్దాం’ అని అనుకున్నారు. ఈలోగా ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందడంతో ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కలకలం రేపుతున్న హషమ్‌బేగ్‌ హత్య

శోకాన్ని మిగిల్చిన శ్రావణి

వైద్య ఉద్యోగి కిడ్నాప్‌ కలకలం

గోదారి తీరం.. కన్నీటి సంద్రం

వివాహిత అనుమానాస్పద మృతి

భర్త అనుమానం..భార్య బలవన్మరణం

రేవ్‌ పార్టీలో మజా చేసిన మంత్రుల కొడుకులు

జ్యోత్స్న మృతిపై దర్యాప్తు ముమ్మరం

వరకట్న వేధింపులకు నవవధువు బలి

టీటీఈపై రైల్వే ప్రయాణికుడి దాడి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు..?!

పూజారి దారుణ హత్య

ప్రేమించకుంటే యాసిడ్‌ పోస్తా!

పెళ్ళై ఐదు రోజులకే నవవధువు ఆత్మహత్య

అయ్యయ్యో.. ఎంత కష్టం!

మయన్మార్‌ టు హైదరాబాద్‌

వ్యభిచార కేంద్రం నిర్వాహకుడి అరెస్ట్‌

పూనం కౌర్‌ కేసు.. 36 యూట్యూబ్‌ లింక్‌లు

టార్గెట్‌ సెల్‌ఫోన్స్‌!

‘స్కిమ్మింగ్‌’తో దోపిడీ!

1,381 కేజీల బంగారం సీజ్‌

కోడెలపై కేసు.. అరెస్ట్‌కు వెనుకంజ

డేటా దొంగలకు ఢిల్లీ లింక్‌!

గుప్తనిధుల కోసం తవ్వకం

రుషికొండ రేవ్‌ పార్టీ : నలుగురు అరెస్ట్‌

నయీమ్‌ ఆస్తుల్ని లెక్క తేల్చిన సిట్‌

రాజేశ్వరి భర్త, అత్తపై కేసు నమోదు

భర్త నల్లగా ఉన్నాడని తగలెట్టేసింది!

దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్‌ నేర్పిస్తా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొడుక్కి సారీ చెప్పిన నాని!

విక్కీతో డేటింగ్‌ చేయాలనుంది

అవసరమైతే తాతగా మారతా!

అర్జున్‌రెడ్డి విడుదలకు సిద్ధం

సయ్యాటలు కాదా? జగడమేనా!

‘నా కల నిజమైంది.. ప్రపంచానికి నేనే హీరోయిన్‌’