ప్రేమజంట ఆత్మహత్య

31 May, 2018 07:38 IST|Sakshi

టీ.నగర్‌: పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిన్నసేలం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా చిన్నసేలం సమీపంలోగల వరదప్పనూరు గ్రామానికి చెందిన ఏళుమలై కుమార్తె పూజ (16). ఈమె, అదే ప్రాంతానికి చెందిన విఘ్నేష్‌ (21)  ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం.

ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో వారు వ్యతిరేకించారు. దీంతో విరక్తిచెందిన ప్రేమజంట మంగళవారం ఇంటి నుంచి పరారయ్యారు. తర్వాత ఉళయనల్లూరు వెళ్లే రోడ్డులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.  సమాచారం అందుకున్న చిన్నసేలం పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు