తమిళ ప్రేమజంట ఆత్మహత్య

29 Nov, 2018 11:12 IST|Sakshi
మోనీషా (ఫైల్‌) హేమంత్‌కుమార్‌ ఓటరు గుర్తింపు కార్డు

పెళ్లికి పెద్దల నిరాకరణ

రైలుకింద పడి బలవన్మరణం

మృతులిద్దరూ తమిళవాసులు

వారు ఇద్దరూ నాలుగేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. కులం కూడా ఒక్కటే కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారని భావించారు. వరుసకు బావ అయ్యే వ్యక్తి ని పెళ్లి చేసుకోవాలని యువతిపై తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. పెద్దలను ఒప్పిం చేందుకు ప్రేమజంట ఎన్నిసార్లు ప్రయత్నించినా వారి మనసు కరగలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమజంట మృత్యువులోనైనా ఒక్కటి కావాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కుప్పం రైల్వే స్టేషన్‌లో బుధవారం జరిగింది.

చిత్తూరు, కుప్పం రూరల్‌ : పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. రేణిగుంట రైల్వే ఎస్‌ఐ అనీల్‌కుమార్, కుప్పం హెడ్‌కానిస్టేబుల్‌ నాగరాజు కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా అత్తిమాంజేరి గ్రామానికి చెందిన కె.ఎస్‌.హేమంత్‌కుమార్‌ (22), అదే గ్రామానికి చెం దిన జి.ఎస్‌. మోనీషా (19) నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవా రు. రెండు నెలల క్రితం ఇద్దరి తల్లిదండ్రులకు ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేయాలని కోరారు. పెళ్లికి మోనీ షా తల్లిదండ్రులు నిరాకరించారు. మంచి ఉద్యోగం లేని హేమంత్‌కుమార్‌తో పెళ్లి కుదరదని ఖరాకండిగా చెప్పారు. వరుసకు బావ అయిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారు.

ప్రాణప్రదంగా ప్రేమించిన హేమంత్‌కుమార్‌ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోనని మోనీషా తెగేసి చెప్పింది. తల్లిదండ్రులు కూడా అంతే ప్రతిఘటించారు. దీంతో మనస్తాపానికి చెందిన హేమంత్‌కుమార్, మెనీషా మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయలుదేరి రైలులో కుప్పం రైల్వేస్టేషన్‌ చేసుకున్నారు. రాత్రి 12 గం టలకు ఫ్లాట్‌ఫాం  టికెట్టు తీసుకుని రైల్వేస్టేషన్‌లోనే ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున దళవాయికొత్తపల్లి రైల్వేగేటు సమీపంలోని రైలు పట్టాలపై విగతవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడి పరిస్థితిని బట్టి ఇద్దరూ పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాలను కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు రేణిగుంట రైల్వే ఎస్‌ఐ అనీల్‌కుమార్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు