ప్రేమ విఫలమై..

14 Sep, 2019 12:56 IST|Sakshi
ఉరికి నిర్జీవంగా వేలాడుతున్న రాజువంశీ

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

సింగరాయకొండ: ప్రేమ విఫలమవడంతో యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఊళ్లపాలెం పంచాయతీలోని సాల్ట్‌ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఊళ్లపాలెంలోని తూర్పు లంపరెడ్డిపాలెంలో రాజువంశీ (19) నివసిస్తున్నాడు. ఇతను కూలి పనిచేస్తూ జీవిస్తుండగా తండ్రి లారీ డ్రైవర్‌గా వెళ్తుంటాడు. తల్లి గతంలోనే చనిపోయింది. కొంతకాలంగా వంశీ బింగినపల్లికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. గురువారం ఆ యువతికి చెందిన బంధువులు గ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఆ రోజు ఉదయం 8.30 గంటల సమయంలో హోటల్లో టిఫిన్‌ చేసి తర్వాత మద్యం కూడా తాగి కొద్దిసేపటికి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. యువతి బంధువులు హెచ్చరించడంతో ప్రేమ విఫలమైందన్న బాధలో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పులి రాజేష్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు