ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని..

15 Dec, 2018 09:46 IST|Sakshi
మమత మృతదేహం

భవనంపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

జియాగూడ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు నిశ్చితార్థం చేసుకొని మోజు తీరాక పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ఆ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కార్వాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కార్వాన్‌కు చెందిన రాజేష్, బేగంబజార్‌కు చెందిన మమత(17)కు రెండేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది.

అప్పటి నుంచి ఇద్దరూ కలిసి తిరిగారు. గురువారం రాత్రి కార్వాన్‌లో ఉంటున్న పెదనాన్న అర్జున్‌ ఇంటికి వచ్చిన మమత, ఆమె తల్లి లక్ష్మీభాయి రాజేష్‌ తల్లిదండ్రులను పిలిపించి పెళ్లి చేసుకోవాలని కోరారు. అందుకు రాజేష్‌ నిరాకరించడంతో మనస్తాపానికిలోనైన మమత భవనం  మూడో అంతస్తుపైకి వెళ్లి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందింది.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా