ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

4 May, 2019 07:17 IST|Sakshi
అంజలి (ఫైల్‌)

మియాపూర్‌: ప్రేమ విఫలమై వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ లింగానాయక్‌ సమాచారం మేరకు... వైజాగ్‌ అక్కయ్య పాలెంకు చెందిన ముని కనకదుర్గ, ముని వెంకటరావుల కూతురు అంజలి ఉమామహేశ్వరి(23) వైజాగ్‌లోని సిన సెంట్రీస్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అదే కంపెనీలో పనిచేస్తున్న జాజిబాబు, ఉమామహేశ్వరి ప్రేమించుకున్నారు. కొంతకాలంగా జాజిబాబుకు వసుంధర అనే అమ్మాయి దగ్గరైంది. వసుంధరతో చాటింగ్‌ చేయడాన్ని గమనించిన ఉమ మహేశ్వరి.. జాజిబాబును నిలదీసింది. దీంతో వారి మధ్య గొడవ రావడంతో వైజాగ్‌లోని ఐదవ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఇరువురి పెద్దల సమక్షంలో పంచాయితీ జరగడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం ఇరువురు దూరయమ్యారు. ఈ గొడవలను మరిచి పోవడానికి ఉమ మహేశ్వరి తల్లితో కలిసి గత నెల 25న మియాపూర్‌ ఆల్విన్‌కాలనీలోని తన సోదరి పావని ఇంటికి వచ్చింది. ఉమా మహేశ్వరి ఇక్కడికి వచ్చిన తరువాత వసుంధర నుంచి మెసేజ్‌లు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన ఉమామహేశ్వరి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌ రూంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటి నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూసేసరికి ఉమామహేశ్వరి ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దింపి దగ్గర్లో ఉన్న శ్రీకార్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ముందు నా చావుకు జాజిబాబు, వసుంధరలే కారణమని వారిని శిక్షించాలి అంటూ సెల్ఫీ వీడియో తీసింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

టోల్‌గేట్‌ బిల్లింగ్‌ బూత్‌ను ఢీకొన్న లారీ

క్యాషియర్‌పై దాడి చేసి దోపిడీ

అనంతపురంలో క్షుద్రపూజల కలకలం!

నిర్లక్ష్య‘భటులు’..!

కలిదిండిలో కక్షతో.. భర్త లేని సమయంలో దాడి!

ఇటీవలే శ్రీలంక పర్యటన.. క్షణికావేశంలో ఆత్మహత్య

ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!

వివాహేతర సంబంధంపై అనుమానంతో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌