మల్కాజిగిరిలో వెలుగుచూసిన మరో 'లవ్ జిహాదీ’ వ్యవహారం

3 Sep, 2019 21:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో మరో లవ్‌ జిహాదీ వ్యవహారం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో  రఫిక్‌ అనే యువకుడు ఓ దళిత యువతిని మోసం చేసిన ఘటన మల్కాజిగిరిలో కలకలం రేపుతోంది. రఫిక్.. తనను బలవంతంగా మతం మార్చి పెళ్ళి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించారు. గర్భం దాల్చిన తర్వాత తనను మోసం చేసాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణవేణి అలియాస్ షబానా, రఫీక్ మల్కాజిగిరి మల్లికార్జున్ నగర్‌లో నివాసముండేవారు.

వరంగల్‌కి చెందిన రఫిక్‌ .. 6 ఏళ్ల  క్రితం క్రిష్ణవేణితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేటలో  ఉద్యోగం చేస్తూ ఆమెను పెళ్ళిచేసుకున్నారు. అమ్మాయి హిందువు కావడంతో మతం మారితే కానీ పెళ్ళిచేసుకోనని రఫిక్ తెలపడంతో తప్పనిసరి పరిస్థితుల్లో  కృష్ణవేణి బలవంతంగా మతం మార్చుకుని షబానా గా మారింది. పెళ్లైనా తరువాత కొన్ని రోజులు కాపురం బాగానే సాగింది. కానీ కొద్ది రోజుల తరువాత అసలైన కథ మొదలైంది. పిల్లలు కావాలని రఫిక్ షబానాను బలవంతం చేయడం మొదలుపెట్టాడు. అనారోగ్యం వల్ల షబానాకు నాలుగు సార్లు అబార్షన్ అయింది. అవేమీ పట్టించుకోని రఫిక్‌ అప్పటినుంచి భార్యని వేధించడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం పుట్టింటినుంచి డబ్బులు తేవాలని హిం‍సించడం ప్రారంభించాడు.

దీనిపై షబానా పలుమార్లు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కౌన్సిలింగ్ తో సరిపెట్టారు. ఆఖరికి తాజాగా షబానా గర్భందాల్చారు. అయితే రఫిక్‌ షబానాకు నాలుగో నెల రాగానే తనకు సంబంధం లేదని వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ పేరుతోఇలాంటి నీచపు పనులకు దిగజారే వాడిని కఠినంగా శిక్షించాలని భాదితురాలు క్రిష్ణవేణి(షబానా) డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు