ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే

21 Mar, 2019 14:37 IST|Sakshi
వివరాలు తెలుపుతున్న డీఎస్పీ శిరీష , హత్యకు ఉపయోగించిప డ్రిప్‌పైపు, సెల్‌ఫోన్లు

సాక్షి, నవాబుపేట: ప్రియురాలి అన్న తమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువకుడు అతడిని దారుణంగా హత్య చేశాడు. మండల పరిధిలో చిట్టిగిద్ద గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం నవాబుపేట పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శిరీష నిందితుల వివరాలు వెల్లడించారు. నవాబుపేట మండల పరిధిలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన షేక్‌ సోహెల్‌(20) ఈ నెల 14న గ్రామ శివారులో హత్యకు గురయ్యాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఫరీదాబేగం ఫిర్యాదుతో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ కృష్ణ మరికొంత మంది సిబ్బందితో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు రంభించారు. గ్రామస్తుల సమాచారం మేరకు మృతుడి పెద్దమ్మ కొడుకు ఎల్లకొండ గ్రామానికి చెందిన తొంట అమీర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా సోహేల్‌ను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడు.  

హత్య జరిగిందిలా..  
సోహెల్‌ చిన్న చెల్లెలు, అమీర్‌ గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి విషయమై సోహెల్‌ ను అడగ్గా నిరాకరించాడు. దాంతో సోమేల్‌ బతికుండగా మా పెళ్లి కాదు, అతన్ని అంతం చేయాలని అమీర్‌ నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలి యని సోహేల్‌ తనకు ఆరోగ్యం బాగాలేదు మహారాష్ట్రలోని దర్గాకు వెళ్లాలి. కొంత డబ్బు ఇవ్వమని అమీర్‌ను అడిగగా.. అందుకు అమీర్‌ ఒప్పుకున్నాడు. ఈ నెల 13న సాయంత్రం అమీర్‌ మృతుడికి ఫోన్‌ చేసి డబ్బులు ఇస్తా అని చెప్పడంతో సోహెల్‌ ఎల్లకొండకు వెళ్లాడు.

తిరిగి వీరు నవాబుపేటకు వచ్చి వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి చిట్టిగిద్ద గ్రామ శివారులోని లింగంపల్లి గుట్ట వద్దకు వెళ్లారు. అతిగా మద్యం సేవించిన సోహెల్‌ తాను కాసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పాడు. ఇదే అదునుగా భావించిన అమీర్‌ అక్క డే ఉన్న డ్రిప్‌పైపుతో సోహెల్‌ గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతుడి పోన్‌ తీసుకొని అక్కడి నుంచి ఏమీతెలియనట్లు ఇంటికి వెళ్లాడు. గ్రామస్తుల సమాచారంతో విచారణ చేపట్టగా అ మీర్‌ నేరాన్ని అంగీకరించాడని, హత్యకు ఉపయోగించిన డ్రిప్‌పైపు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శిరీష తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ కృష్ణ ఉన్నారు. 

మరిన్ని వార్తలు