కోరిక తీరాక.. పెళ్లి వద్దన్నాడు

14 Nov, 2018 09:01 IST|Sakshi
చికిత్స పొందుతున్న యువతి

సాక్షి, సూర్యాపేట క్రైం : ప్రియుడు మోసం చేశాడని.. ప్రియురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పిన్నాయిపాలెం గ్రామానికి చెందిన కక్కిరేణి సత్తయ్య కుమార్తె ఉమారాణి డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటోంది. ఇదే క్రమంలో దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన సుద్దబావి శ్రీకాంత్‌ చండూరు మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఉమారాణి చెర్వుగట్టుకు వెళ్లగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీకాంత్‌ చిన్నమ్మ జయ ద్వారా ఉమకు పరిచయం ఏర్పడింది.

రెండేళ్ల క్రితం తాళ్లవీరప్పగూడేనికి ఉమారాణిని జయ రప్పించింది. ఓ గదిలో కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఉమారాణికి ఇచ్చింది. అనంతరం శ్రీకాంత్‌ గదిలోకి వెళ్లి శారీరకంగా అనుభవించాడు. ఉమారాణి మత్తునుంచి తేరుకున్న  శ్రీకాంత్, జయను నిలదీయగా ఇద్దరం ఒకే కులానికి చెందిన వారం కావడంతో వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. రెండేళ్లనుంచి శారీరకంగా అనుభవిస్తూ కాలం వెల్లదీస్తూవచ్చా డు. శ్రీకాంత్‌ తన చెల్లి వివాహం జరిగాక వివాహం చేసుకుందామని చెప్పాడు. ఇటీవల శ్రీకాంత్‌ చెల్లి వివాహం జరగగా.. శ్రీకాంత్‌ తమ మేనత్త కూతురితో వివాహ నిశ్చయం చేసుకున్నాడు. ఇదే విషయాన్ని జయ ఉమారాణికి ఫోన్‌ ద్వారా నెల రోజుల క్రితం చేరవేసింది.

ఉమారాణి  మాట్లాడేందుకు శ్రీకాంత్‌కు ఫోన్‌ చేయగా.. లిఫ్టు చేయ లేదు. ఈ క్రమంలో  20 రోజుల క్రితం సూర్యాపే ట డీఎస్పీ నాగేశ్వరరావును కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. శ్రీకాంత్‌ను డీఎస్పీ నాగేశ్వరరావు పిలిపించాడు. ఇరువర్గాలు మాట్లాడుకోవాలని చెప్పి కొంతకాలం గడిచాక సంఘటన ఇక్కడ జరగలేదు కాబట్టి..  కేసు పెట్టలేమని చెప్పినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు పెట్టిన కొంతకాలం సమయం గడిపి వారి ప్రేమాయణం ఇక్కడ సాగలేదంటూ ఎక్కడ సాగిందో అక్కడే కేసు పెట్టుకోవాలన్నారని.. ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతూ ఉందని వాపోయారు. దీంతో ఉమారాణి కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా ఎస్పీని కలిసేందుకు మంగళవారం  పోలీసు కార్యాలయానికి చేరుకుంది. సమయానికి ఎస్పీ ఇతర సమావేశాల్లో ఉండగా.. ఎదురుచూసి చేసేదేమిలేక వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఏరియాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఉమారాణికి ఏరియాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు