దారుణం : ప్లాన్‌చేసి మరీ భార్యను!

4 Aug, 2018 15:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విదిశా : నిత్యం తాగొచ్చి హింసించే ఆ నిందితుడు, ఇంట్లో ఎవరూ లేకుండా ప్లాన్‌చేసి మరీ భార్యను హత్యచేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని విదిశాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. విదిశాలోని రాజ్‌పుత్‌ కాలనీలో హల్కేరామ్‌ కుష్వాహ, దుర్గాబాయ్ (35) కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. భార్యతో తరచు గొడవపడే కుష్వాహ శుక్రవారం రోజు తన ఇద్దరు కుమారులను బటయకు వెళ్లాలని సూచించాడు. తండ్రి మాట విన్న ఇద్దరు టీనేజర్లు సాయంత్ర ఇంటికి వచ్చి చూడగా తల్లి ఎలాంటి కదలిక లేకుండా పడిఉండటాన్ని గమనించారు. తండ్రి చేసిన దురాగతాన్ని అర్థం చేసుకున్న 15 ఏళ్ల బాలుడు తల్లి హత్యపై ఫిర్యాదు చేశాడని కోత్వాలి పీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఎన్‌ శర్మ తెలిపారు. తాగొచ్చి అమ్మను నాన్న కొట్టేవాడని, గతంలో ఓసారి విషం పెట్టి చంపాలని చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమ కుమారులు ఇంట్లో లేకుండా చేసి హత్య చేయాలని కుష్వాహ ప్లాన్‌ చేసుకున్నాడు. ప్లాన్‌ ప్రకారమే.. వారిని బయటకు పంపించి నిద్రపోతున్న భార్యను హత్య చేశాడు. భార్య ముక్కు, నోరు, కళ్లల్లో గట్టిగా అతుక్కునే జిగురులాంటి పదార్థాన్ని నిందితుడు పోసి.. ఓ గుడ్డను గట్టిగా చుట్టాడు. తొలుత దుర్గాబాయ్‌ కళ్లు ముసుకుపోయిన తర్వాత ముక్కు, నోరు భాగాల్లో జిగురుపోసి ఊపిరాడకుండా చిత్రహింసలకు గురిచేసి భార్యను ఆ నిందితుడు హత్య చేశాడని ఇన్‌స్పెక్టర్‌ శర్మ వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

2016 మే నెలలో మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు మద్యం సేవించి ఇదేతీరుగా నిద్రిస్తున్న భార్యను హత్య చేయడం పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా