అశ్లీల చిత్రాలు చూపిస్తూ తండ్రి కొడుకు..

22 Jul, 2019 14:47 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు దుండగులు. బాలికకు అశ్లీల చిత్రాలను చూపిస్తూ 16 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వేధింపులకు భరించలేక అసలు విషయాన్ని తండ్రికి చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో తండ్రికొడుకులు, ఓ మైనర్‌ బాలుడు ఉండడం గమనార్హం. 

వివరాలు.. ఇండోర్‌ చెందిన ఓ 16 ఏళ్ల బాలిక తల్లి చనిపోవడంతో తొమ్మిదో తరగతిలోనే చదువు మానేసి తండ్రి, చెల్లితో కలిసి ఉంటుంది. బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పోషించుకుంటున్నారు. వారి ఇంటిపక్కనే ఉండే ఓ వ్యక్తి క్యాటరింగ్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. తాము క్యాటరింగ్‌ పనిలో బిజీగా ఉంటున్నామని, తమ పిల్లలను చూసుకునేందుకు బాలికను పంపించమని తండ్రిని కోరారు. రోజూ ఇంత డబ్బు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. తండ్రి డ్యూటీకి వెళ్లగానే బాలికి ఆ కాంట్రాక్టర్‌ ఇంటికి వెళ్లి పిల్లలను చూసుకునేంది. ఆ బాలికపై కన్నేసిన సదరు కాంట్రాక్టర్‌.. ఆమెకు తరచూ ఫోన్‌లో అశ్లీల చిత్రాలను చూపిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను లేని సమయంలో ఆయన కుమారుడు(23) కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తామని బెదిరించారు.

 కొన్నాళ్లకు సదరు యువతి తన స్కూల్ ఫ్రెండ్ అయిన అబ్బాయికి విషయం చెప్పి సాయం కోరింది. నిందితుడికి మేనల్లుడైన సదరు యువకుడు సైతం సాయం చేయకపోగా విషయం ఆమె తండ్రికి చెబుతానని బెదిరించి అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు. ఆ విషయం తెలుసుకున్న అతని సోదరుడు సైతం యువతిని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు సదరు యువతి ఇంటి పక్కనే ఉండే ఇద్దరు యువకులకు విషయం తెలియడంతో వారు సైతం ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

వీరి వేధింపులకు భరించలేక బాలిక విషయాన్ని తండ్రికి చెప్పింది. బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదు ఆధారంగా క్యాటరింగ్ కాంట్రాక్టర్, అతని కొడుకు, వారి బంధువులైన 16, 18 ఏళ్ల యువకులతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మలేషియా జైల్లో మనోళ్లు బందీ

అవమానాలు భరించ లేకున్నా.. వెళ్లిపోతున్నా..

మత్తులో కత్తులతో వీరంగం!

మోసగాడు.. ఇలా దొరికాడు

ఆషాఢమని భార్య పుట్టింటికి వెళితే..

ప్రేమ జంటలే టార్గెట్‌

‘ఆ ఊహనే భరించలేకున్నా.. చనిపోతున్నా’

వివాహేతర సంబంధమా.. వ్యాపారుల మధ్య పోటీయా..?

ట్రాక్టర్‌ డ్రైవర్‌ దారుణహత్య

హిజ్రా చంద్రముఖి ఫిర్యాదు..

వందల కోట్లు లంచంగా ఇచ్చా

భర్త, కుమారుడిని వదిలేసి సహజీవనం.. ఆత్మహత్య

బాలికపై సామూహిక లైంగికదాడి

ఇంటి పైకప్పు కూలి చిన్నారి దుర్మరణం

కుప్పంలో దొంగనోట్ల ముఠా!

ఎంపీ గల్లా అనుచరులపై కేసు

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

ప్రేమ వ్యవహారమేనా..?

సౌదీలో పరిచయం.. తమిళనాడులో సంబంధం

బ్యూటీషియన్‌ దారుణ హత్య

అమెరికాలో పూజారిపై దాడి

హైదరాబాద్‌కు ఐసిస్‌ నమూనాలు!

ముసద్దిలాల్‌ జ్యువెల్లర్స్‌పై మరో కేసు

షేక్ సద్దాంను హత్య చేసిన నిందితుల అరెస్ట్‌

ఉపాధ్యాయుల ఇళ్లలో భారీ చోరీ

నిరుద్యోగులే టార్గెట్‌.. రూ.కోటితో ఉడాయింపు!

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

ఉద్యోగాలిప్పిస్తానని.. ఉడాయించేశాడు..!

రక్తంతో గర్ల్‌ఫ్రెండ్‌కు బొట్టుపెట్టి..

పింకీ! నీవెలా చనిపోయావో చెప్పమ్మా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి