‘మహా’ పోలీసుల అదుపులో మావో అగ్రనేతలు 

12 Jun, 2019 02:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీలో పనిచేస్తున్న కిరణ్‌ కుమార్‌ (63), అతని భార్య నర్మద (60)ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీరిద్దరూ ఏప్రిల్‌ 9న ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవిపై జరిగిన బాంబు దాడి అమలు వ్యూహంలో నిందితులుగా ఉన్నారు. అలాగే గడ్చిరోలిలో 16 మంది మృతికి వీరు కారణమయ్యారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు వీరి కోసం గాలిస్తూ ఎట్టకేలకు పట్టుకున్నారు. కిరణ్‌ అలియాస్‌ కిరణ్‌ దాదా మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ మెంబర్‌గా కొనసాగుతున్నారు. అతనిపై రూ. 20 లక్షలకు పైగా రివార్డు ఉంది. కిరణ్‌తో పాటు అతని భార్య విజయవాడకు చెందిన మహిళగా గుర్తించారు. 2019 మే 1వ తేదీన గడ్చిరోలిలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేయగా 16 మంది పోలీసులు దుర్మరణం చెందారు. ఈ దాడికి మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ కిరణ్‌ వ్యూహం అమలు పరిచినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.  

మరిన్ని వార్తలు