‘అతడిపై హత్య కేసు కూడా ఉంది’

11 Sep, 2019 14:18 IST|Sakshi
రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌(ఫైల్‌ ఫొటో)

చోరీ కేసు వివరాలు వెల్లడించిన సీపీ మహేశ్‌ భగవత్‌

సాక్షి, హైదరాబాద్‌ : నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర దొంగలను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. దొంగల గ్యాంగ్‌కు నాయకుడిగా వ్యవహరిస్తున్న బాబ్లీ మహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... సెప్టెంబరు 4న కుషాయిగూడలోని నగల దుకాణంలో ఉన్న చోరీ జరిగిందని తెలిపారు. తెల్లవారుజామున షాపులో చొరబడ్డ దొంగలు వెండి మొత్తం దోచేశారని పేర్కొన్నారు. క్రైమ్‌సీన్‌ పరిశీలనలో భాగంగా దొరికిన ఓ బ్యాగ్‌ ద్వారా చోరీ కేసు ఛేదించామన్నారు. దొంగలను బిహార్‌కు చెందిన అరారి గ్యాంగ్‌గా గుర్తించామని... వారిని పట్టుకోవడంలో బిహార్‌ పోలీసుల సహకారం మరువలేనిదని ధన్యవాదాలు తెలిపారు.

చోరీ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడిస్తూ....‘ చోరీ తరువాత దొంగల గ్యాంగ్‌ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బిహార్‌కు బయల్దేరింది. వారి కోసం పట్నా, బిహార్‌ రాష్ట్రమంతా గాలింపు మొదలు పెట్టాము. రన్నింగ్ ట్రైన్‌లోనే వారిని పట్టుకునేందుకు ప్లాన్ చేశాము. అలా ధానాపూర్ రైల్వే స్టేషన్‌లో గ్యాంగ్‌ని పట్టుకున్నాము. గ్యాంగ్‌కి బాబ్లీ మహుమ్మద్ అనే వ్యక్తి లీడర్‌గా ఉన్నాడు. అతడిపై గతంలో హత్య కేసుతో పాటు అనేక ఇతర కేసులు ఉన్నాయి. మొత్తం రూ. 11 లక్షల 49 వేలు నగదు..11 తులాల బంగారం, చోరికి ఉపయోగించిన పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నాము. ఈ గ్యాంగ్ కీసరలో కూడా చోరికి పాల్పడ్డట్టు గుర్తించాము. గ్యాంగ్‌లో ఆరుగురిని అరెస్ట్ చేశాము. హైదరాబాద్ వచ్చే ముందు కర్ణాటక, గోవాలో కూడా వీళ్లు తిరిగారు. నిజానికి జ్యూవెలరి షాపు యజమాని సెక్యూరిటీ విధానం వల్ల.. కేసును తొందరగా ఛేదించేందుకు అవకాశం దొరికింది అని పేర్కొన్నారు.

అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం
గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఫొటోలు, వీడియోలు ప్రసారం చేయవద్దని సీపీ మహేశ్‌ భగవత్‌ విఙ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు 11వేల 9వందలకు పైగా గణేష్ విగ్రహాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. నిన్నటి వరకు 9 వేల విగ్రహాలను నిమజ్జనం చేశారని వెల్లడించారు. రాచకొండ పరిధిలోని 25 ప్రాంతాల్లో అన్ని శాఖ సమన్వయంతో నిమజ్జనం జరుగుతుందన్నారు. గురువారం బాలాపూర్ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఆరు గంటలకు మొదలవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 250 సీసీటీవీ ఆధ్వర్యంలో మానిటరింగ్ జరుగుతుందని..మొత్తం 9 వేల కెమెరాలతో జియో ట్యాగింగ్ ద్వారా కంట్రోల్ రూమ్ నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 5060 సిబ్బంది గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారని సీపీ వెల్లడించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఘరానా దొంగ మంత్రి శంకర్‌ మళ్లీ దొరికాడు

నగరంలో నేపాలీ గ్యాంగ్‌

ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్‌ మృతి 

ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే

ఆటోలో తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం

ప్రజలకు చేరువగా పోలీస్‌ ఠాణాలు

ప్రాణం తీసిన పబ్‌జీ

గంజాయి సిగరెట్‌ @ రూ.100

వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.. దేహశుద్ధి 

పండగకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు

కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది

పసికందు మృతి.. గుట్టు చప్పుడు కాకుండా

మత్తుమందు ఇచ్చి నగలు దోపిడీ

బాలికపై అత్యాచారయత్నం

నెత్తురోడిన జాతీయ రహదారి: 24 మందికి తీవ్ర గాయాలు

ఇద్దరు దొంగలు అరెస్ట్‌: 159 గ్రాముల బంగారం స్వాధీనం

పెళ్లికి నిరాకరించిందని దాడి!

స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ

బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి..

కాపురానికి తీసుకెళ్లాలని ఆందోళన

చంపి బావిలో పడేశారని భర్తపై దాడి..

మూడో పెళ్లికి సిద్ధం.. ఇద్దరు పెళ్లాల యుద్ధం

పెళ్లి కాకుండానే గర్భం.. విచ్ఛిత్తికి యత్నం

ఆడపిల్ల అని చంపేశారు 

దారుణం : భర్త కళ్ల ముందే భార్యపై అత్యాచారం

దొంగతనానికి వెళ్లి యువతి పక్కన నగ్నంగా...

అప్పుల్లో మునిగి పనిచేసే సంస్ధకు కన్నం..

ప్రియుడి కోసం భర్త దారుణ హత్య

ఫ్యామిలీ కోసం ప్రాణాలే ఇచ్చాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

'నిశ్శబ్దం'లో అనుష్క అదిరిపోయిందిగా..

దబాంగ్‌ 3: అదిరిపోయిన ఫస్ట్‌లుక్‌

పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!

కంచిలో షురూ

ఒరేయ్‌.. బుజ్జిగా 

విజయశాంతిగారిలా పాయల్‌ స్టార్‌ ఇమేజ్‌ తెచ్చుకోవాలి