మహిళా అధికారిని వేధించిన మేజర్‌పై వేటు

24 Dec, 2018 09:24 IST|Sakshi

న్యూఢిల్లీ : మహిళా అధికారిని లైంగిక వేధింపులకు గురిచేసిన మేజర్‌ జనరల్‌ ఎంఎస్‌ జస్వాల్‌ను ఆర్మీ జనరల్‌ కోర్టు మార్షల్‌ (జీసీఎం) సర్వీసు నుంచి డిస్మిస్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్వాల్‌ రెండేళ్ల కిందట నాగాలాండ్‌లో పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా కొహిమాలో పనిచేస్తున్న సమయంలో కెప్టెన్‌ ర్యాంక్‌ అధికారి అయిన మహిళను తన రూమ్‌కు పిలిపించుకుని అసభ్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపించారు.

అయితే సైన్యంలో వర్గ పోరును తనను బలిపశువును చేశారని, తాను అమాయకుడినని నిందితుడు చెప్పుకొచ్చారు. మేజర్‌ జనరల్‌పై ఈ ఏడాది జూన్‌ నుంచి విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. కాగా జీసీఎం తీర్పుపై మేజర్‌ జనరల్‌ ఎగువ కోర్టులో అప్పీల్‌కు వెళతారని ఆయన తరపు న్యాయవాదులు వెల్లడించారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓటుకు నోటు కేసులో కొనసాగుతోన్న విచారణ

తండ్రి మృతి.. కుమారుడి పరిస్థితి విషమం

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

దొంగల్ని పట్టించిన వేలిముద్రలు

ప్రేయసికి పెళ్లయిందని యువకుడి బలవన్మరణం 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాక్‌ గాయకుడిని తీసేసిన సల్మాన్‌

నాని విలన్‌గానా!

‘నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శంకర్‌’

‘గల్లీ బాయ్‌’ రీమేక్‌లో మెగా హీరో

‘విశ్వదర్శనం’ టీజర్‌ లాంచ్‌

శివకార్తికేయన్‌తో ‘హలో’ బ్యూటీ