టీవీ యాంకర్‌ అనుమానాస్పద మృతి

24 Dec, 2019 10:32 IST|Sakshi

తిరువనంతపురం : ప్రముఖ మలయాళ టీవీ యాంకర్‌, సెలబ్రిటీ చెఫ్‌ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.  కురవాన్‌ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. దీంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాగీ మృతదేహాంపై ఎటువంటి గాయాలు లేవని తెలిపిన పోలీసులు.. అనమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. 

‘జాగీ తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. జాగీ మృతిచెందిన సమయంలో ఆమె తల్లి ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె తల్లి మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో.. జాగీ ఎలా మృతి చెందారనే అంశంపై సరైన సమాచారం రాబట్టలేకపోయామ’ని పోలీసులు తెలిపారు.  కాగా,  38 ఏళ్ల జాగీ ఓ టీవీ చానల్‌లో వంటల పోగ్రామ్‌ నిర్వహిస్తున్నారు. బ్యూటీ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆమె గాయనిగా, మంచి వక్తగా గుర్తింపు పొందారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఎంను హత్య చేయాలంటూ వీడియో.. వ్యక్తి అరెస్ట్‌!

కరోనా: ప్రముఖ బ్యాట్స్‌మన్‌ టీషర్ట్‌ వేలం!

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

సినిమా

మ‌ళ్లీ అడ్డంగా దొరికిన న‌టి, ఇదిగో ఫ్రూఫ్‌..

‘నాలుగో సింహం ఎవరో చెప్పిన సాయి కుమార్‌’

ఆర్జీవీ: రోజూ గిల్లే వాడు

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..