ఆమె జీతంతో పాటు జీవితాన్నికూడా మోసం..

22 Aug, 2019 11:28 IST|Sakshi

నేరేడ్‌మెట్‌: పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహ్మాస్వామి వివరాలు వెల్లడించారు. నేరేడ్‌మెట్‌కు చెందిన యువతి ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. పదేళ్ల క్రితం ఆమెకు ఓల్డ్‌ సఫిల్‌గూడకు చెందిన శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి తరుచూ వారిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. 2016లో పెళ్లి చేసుకుంటానని శ్రీకాంత్‌ ప్రతిపాదించగా ఆమె అంగీకరించింది. అప్పటి నుంచి ఆమె జీతం డబ్బులను శ్రీకాంత్‌ తీసుకునే వాడు. మూడేళ్లుగా కలిసి తిరుగుతున్నారు. ఏడాది క్రితం ఇంట్లో  ఎవరూ లేని సమయంలో  సదరు యువతి ఇంటికి వచ్చిన అతను ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గత రెండు నెలలుగా యువతి ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వకపోగా తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థినిని ప్రేమ పేరుతో..

కరోనా: హిట్‌ మ్యాన్‌ భారీ విరాళం!

పోలీసులు విచారణకు వెళ్తే..

కరోనా అంటూ కొట్టిచంపారు

పాపం మందుబాబు.. ఆరుసార్లు ఓటీపీ చెప్పి..

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌