రూ.1.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాల పట్టివేత

24 Apr, 2018 17:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌: దేశీయ మార్కెట్‌లో సుమారు రూ.1.5 కోట్ల విలువ చేసే ఓపియం అనే మాదక ద్రవ్యాన్ని రాజస్తాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన మాదక ద్రవ్యాలు 71 కేజీల బరువు ఉందని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నిందితుడు సునీల్‌ నగ్ధా మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నీముచ్‌ జిల్లాకు చెందిన వాడిగా గుర్తించారు.

మాదక​ ద్రవ్యాలతో కారులో నీముచ్‌ నుంచి జోధ్‌పూర్‌ తరలిస్తుండగా మార్గమధ్యంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రాపిక్‌ సబ్‌స్టాన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా