మార్ఫింగ్‌ ఫొటోలతో యువతికి వేధింపులు

15 Jul, 2020 20:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫ్‌ చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన రఘు అనే వ్యక్తి ఓ యువతి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి బెదిరిపులకు పాల్పడుతున్నాడు. ఒరిజినల్‌ న్యూడ్‌ ఫొటోలు పంపాలని.. లేకుంటే మార్ఫింగ్‌ చేసినవాటిని ఇంటర్‌నెట్‌లో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు రఘును అదుపులోకి తీసుకున్నారు.(బీర్‌ సీసాతో భార్యపై దాడి)

నిందితుడు రఘును బుధవారం సాయంత్రం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిలా ఎస్పీ విశాల్‌ గున్నీ మాట్లాడుతూ.. నిందితుడిపై ఫిర్యాదు చేసిన యువతిని అభినందించారు. ప్రతి ఒక్కరు ఇలాంటి బెదిరింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.

పుర్లమెరక గ్రామానికి చెందిన కామరాజు గడ్డ రఘబాబు కేరళలో బీఎస్సీ యానిమేషన్ మల్టీమీడియా పూర్తి చేశాడని తెలిపారు. ప్రస్తుతం తన స్వగ్రామంలోనే ఉంటున్న రఘు తనతో చదువుకున్న యువతులతో ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ ల ద్వారా పరిచయాన్ని పెంచుకొని వారి ఫొటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేస్తున్నాడని వెల్లడించారు. మరిన్ని న్యూడ్ ఫొటోలు పంపించాలని లేకుంటే మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని చెప్పారు. అలాగే సోషల్ మీడియా వినియోగించే యువతీ, యువకులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. ఇదే తరహాలో 10 మంది మహిళలను రఘు వేధించినట్టుగా తెలుస్తోంది. (టీడీపీ నేత వేధింపులు.. డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం)

మరిన్ని వార్తలు