కన్నతల్లిని చంపడానికి స్కెచ్‌ వేసి....

11 Oct, 2019 15:09 IST|Sakshi

ఢిల్లీ: అనుమానంతో కళ్లు మూసుకుపోయి కన్నతల్లినే మట్టుబెట్టాలనుకున్నాడో దుర్మార్గుడు. ఏకంగా తల్లిని చంపడానికి కిరాయి హంతకులను ఉపయోగించిన  ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పశ్చిమ ఢిల్లీలోని పాసిమ్‌ విహార్‌ ప్రాంతంలో నివసించే అన్ష్‌ ధింగ్రా అనే వ్యక్తి... తల్లితో ఎడమొహం పెడమొహంగా ఉండేవాడు. పైగా తల్లికి అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. దీంతో ఎలాగైనా ఆమెను హతమార్చాలని భావించి ఓ పథకం పన్నాడు. అందులో భాగంగా ముగ్గురు కిరాయి హంతకులను మాట్లాడుకున్నాడు. అక్టోబర్‌ 6న ఆ ముగ్గురు వ్యక్తులు.. ఇంట్లోకి చొరబడి దొంగతనం చేస్తున్నట్టుగా నటించి అనంతరం తల్లిని చంపడానికి ప్రయత్నించారు.

అయితే ఆమె ఎదురు తిరగడంతో వారు పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో ఒక మైనర్‌ బాలుడు తల్లి చేతికి చిక్కాడు. అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించగా అసలు నిజం బయటపడింది. ఆమె కొడుకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని తేలింది. మైనర్‌తోపాటు రాజేందర్‌, రాహుల్‌లకు తల్లిని చంపమని అన్ష్‌ ధింగ్రా ఆదేశించాడని బాలుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. హత్యాయత్నం చేసిన ముగ్గురు నిందితులతోపాటు అన్ష్‌ ధింగ్రాపై కూడా పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మైనర్‌ను అదుపులోకి తీసుకోగా మిగతా ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా