స్నేహితులతో గడపాలని యువతిపై..

10 Sep, 2018 15:50 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, ముంబై : యువతిని బెదిరించి  లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తన స్నేహితులతో గడపాలని కోరిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్న నిందితుడు ధరన్‌షా ఈనెల 9న తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు తాను కెనడా వెళ్లేందుకు సహకరిస్తారని చెబుతూ తన స్నేహితులతో గడపాలని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 3న కూడా నిందితుడు తనపై లైంగిక దాడికి పాల్పడగా తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిందితుడు దౌర్జన్యం చేశాడని చెప్పారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబరుచుకున్న నిందితుడు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తనను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడని బాధితురాలు పేర్కొన్నారు. తన వద్ద నుంచి రూ 3 లక్షల నగదు, రూ లక్ష విలువైన బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్‌ను తీసుకున్నాడని వాపోయారు. తాము సన్నిహితంగా ఉన్పప్పటి ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని హెచ్చరించాడని చెప్పారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఓదెలు అనుచరుడు గట్టయ్య మృతి

జ్యువెలరీ షాపులో కాల్పుల కలకలం 

పగబట్టి.. బుసకొట్టి..

ఎలుకలు కొరికిన హామీలు

ప్రణయ్‌ హత్యకేసు : రక్షణ కోరుతున్న ప్రేమజంటలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కథ ముఖ్యం అంతే! 

డాడీ కోసం డేట్స్‌ లేవ్‌!

దాచాల్సిన అవసరం లేదు!

గురువారం గుమ్మడికాయ

శ్రీకాంత్‌ అడ్డాలతో నాని?

కెప్టెన్‌ ఖుదాబక్ష్‌