చీరాలలో యువకుడి దారుణ హత్య 

9 May, 2020 08:15 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి, తదితరులు

సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఘటన చీరాల రూరల్‌ మండలం తోటవారిపాలెం పంచాయతీలోని కృపానగర్‌ వద్ద శుక్రవారం జరిగింది. చీరాల పట్టణంలోని హారిస్‌పేటకు చెందిన నల్లగొండ్ల నయోమి, చిరంజీవి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో మొదటి కుమారుడు దినేష్‌ (19)రైల్వేస్టేషన్‌ వద్దనున్న ఓ పెట్రోట్‌ బంకులో పనిచేస్తుంటాడు. గుంటూరు జిల్లా వెదుళ్లపల్లికి చెందిన ఓ యువతి చీరాలలోని దినేష్‌ ఇంటి వద్ద ఉన్న ఓ చర్చికి వస్తుండేది. దినేష్‌ కూడా ఆ చర్చికి వెళ్తుండడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. విషయం తెలియడంతో యువతి కుటుంబ సభ్యులు దినేష్‌ను హెచ్చరించారు. అయినా అతడు పట్టించుకోలేదు. (నగరం నిద్రపోలేదు..!)

దీంతో ఆ యువతితో ఫోన్‌ చేయించి దినేష్‌ను వెదుళ్లపల్లికి పిలిపించారు. చెక్‌పోస్టుల్లో వాహనాలు అనుమతించకపోవడంతో తన స్నేహితుడైన వలంటీర్‌ సతీష్‌కుమార్‌తో కలిసి దినేష్‌ వెదుళ్లపల్లికి బైకుపై బయల్దేరాడు. మార్గమధ్యంలోని కృపానగర్‌ సమీపంలో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వాహనాన్ని అడ్డగించి దినేష్‌పై దౌర్జన్యానికి దిగి కోడి కత్తితో మెడపై పొడిచారు. తీవ్ర గాయాలపాలయిన దినేష్‌ సాయం కోసం కొద్ది దూరం పరుగెత్తి సమీపంలోని ఓ ఇంటి ముందు ఉన్న కురీ్చలో కూర్చుని ప్రాణం విడిచాడు.

వలంటీర్‌ తప్పించుకుని చీరాలకు చేరాడు. జనం రావడాన్ని గమనించిన హంతకులు తమ వెంట తెచ్చుకున్న రెండు వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. డీఎస్పీ వై.జయరామసుబ్బారెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సుధాకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీటిపర్యంత
మయ్యారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు