నడిరోడ్డుపై హత్య.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు

18 Nov, 2019 12:42 IST|Sakshi

తిరువనంతపురం : కేరళలోని అటానీలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు అత్యంత పాశవికంగా హతమార్చారు. కత్తిలాంటి పదునైన ఆయుధాలతో ముగ్గురు వ్యక్తులు అతడిపై విరుచుకుపడి ఘాతుకానికి పాల్పడ్డారు. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి... ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాగా నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని హత్య చేయడంతో అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు.

ఇక ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తిని వినయ్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడికి నేర చరిత్ర ఉందని.. గతంలో ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పేర్కొన్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా