పెళ్లికి నిరాకరించిందని దాడి!

11 Sep, 2019 09:12 IST|Sakshi
యువతిపై దాడికి పాల్పడి ఆత్మహత్యాయత్నం చేసిన మణికుమార్‌

సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ) : పెళ్లికి నిరాకరించడంతో యువతిపై చాకుతో దాడి చేసి ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది.  పోలీసుల కథనం ప్రకారం మార్టేరుకు చెదిన గ్రంధి మణికుమార్‌(28),  రామోజు శాంతకుమారి(22) మార్టేరులోని  ఒక ప్రైవేటు షాపులో పనిచేసేవారు. మణికుమార్‌ ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకు శాంతకుమారి నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం పెనుగొండ గాంధీ బొమ్మల సెంటరుకు పనిమీద వచ్చిన యువతిపై మణికుమార్‌ చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి స్వల్ప గాయం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆమెపై దాడికి పాల్పడిన మణికుమార్‌ అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో మణికుమార్‌ కోలుకుంటున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు