ఎద్దు మాంసం అమ్ముతున్నారని..

19 May, 2018 12:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : ఎద్దు మాంసం అమ్ముతున్నారనే నెపంతో ఇద్దరిని తీవ్రంగా కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్‌ సాత్నా జిల్లాలోని అమ్‌ఘర్‌ అనే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి బాదేరా పోలీసు స్టేషన్‌ పరిధిలో  రియాజ్‌(45), షకీల్‌ (33)లు తమ ఊరికి తిరిగి వెళుతుండగా మార్గం మధ్యలో కొంతమంది గ్రామస్తులు వీరికి ఎదురయ్యారు.

రియాజ్‌, షకీల్‌ వద్ద ఎద్దు మాంసం ఉన్నట్లు గుర్తించిన గ్రామస్తులు వారు మాంసం అమ్ముతున్నారన్న అనుమానంతో తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే రియాజ్‌ మృతి చెందాడు. తీవ్రగాయాలపాలై ప్రాణాలతో పోరాడుతున్న షకీల్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరిలించారు. సంఘటనా స్థలంలో ఒక ఎద్దు కళేబరంతో పాటు మూటకట్టి ఉంచిన మాంసాన్ని పోలీసులు గుర్తించారు. కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు