భార్యను కుక్క కరిచిందని..

25 May, 2019 18:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భార్యను కరిచిందని ఓ వీది కుక్కును దారుణంగా కొట్టి చంపాడో భర్త. చుట్టుపక్కల వాళ్లు అలా కొట్టొద్దని వారించినా వినకుండా కుక్కను చంపి జైలుపాలయ్యారు. ఈ ఘటన ఢిల్లీలోని ముకుందాపూర్‌లో గురువారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ముకుందాపూర్‌కు చెందిన రాజ్‌ కుమార్‌ ఓ  ట్రాన్స్‌ఫోర్ట్స్‌సెక్టార్‌లో పనిచేస్తాడు. గురువారం రాత్రి కుమార్‌ భార్య తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్‌కు వెళ్లారు. అక్కడ వీదిలో ఉన్న ఓ కుక్క ఈ పెంపుడు కుక్కను చూసి మొరుగుతూ.. దాడి చేయబోయింది. దీంతో కుమార్‌ భార్య వీది కుక్కను అక్కడే ఉన్న రాళ్లతో కొట్టింది.

దీంతో ఆ కుక్క ఆమెపై దాడి చేసి పలు చోట్ల కరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క చేసిన గాయాలతో ఇంటికి వచ్చిన కుమార్‌ భార్య.. జరిగిని విషయం భర్తకు చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన కుమార్‌ ఓ కర్ర తీసుకొని వీదిలోకి వెళ్లాడు. కుక్కను గుర్తించి దారుణంగా కొట్టాడు. స్థానికులు అలా కొట్టొద్దని వారించినా వినకుండా కర్రతో బలంగా కుక్కపై దాడి చేశాడు. దీంతో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. ఇదంతా అక్కడ ఉన్న స్థానికుడొకరు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుక్కను చంపొద్దని కోరిన వినకుండా దారుణంగా కొట్టాడని, మొదటి అతని భార్యనే కుక్కను రాళ్లతో కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా