ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక..

10 Oct, 2019 10:29 IST|Sakshi

 యువకుడి ఆత్మహత్య

సాక్షి, భువనగిరి:  ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన  మండలంలోని బండసోమవారం గ్రామశివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రానికి చెందిన సుధీర్‌కుమార్‌(22) మండల పరిధిలోని బండసోమవారం గ్రామంలో ఓ కోళ్లపారంలో ఏడాదినుంచి పని చేస్తున్నాడు.  ఇదే కోళ్లఫారంలో బీహార్‌కు చెందిన డోలి కుమారి, జ్యోతి, రాజులు బతుకు దెరువు నిమిత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. స్థా నికంగా నివాసం ఉన్నారు. ఒకే కుటుం బానికి చెందిన డోలి కుమార్, జ్యోతి, వారి సొదరుడు రాజు ఒకే గదిలో ఉంటున్నారు. అ గదికి సమీపంలోనే సుధీర్‌కుమార్‌ నివా సం ఉండే వాడు. సుధీర్‌కుమార్, జ్యోతిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.  కాగా జ్యోతి, ఆమె సొదరుడు రాజు 25 రోజుల క్రితం సొంత గ్రామం ఉన్న బీహార్‌కు బయాలుదేరి వెళ్లారు. డోలి మాత్రం ఇక్కడే ఉండి పోయింది. బీహర్‌కు వెళ్లిన జ్యోతికి 10 రోజుల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. ఇ వివాహానికి సంబంధించిన ఫొటోలను డోలికుమారికి పంపింది. అ ఫొటోలను చూసిన సుధీర్‌కుమార్‌ కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోయాడు. తను ప్రేమించిన యువ తి మారొకరితో వివాహం చేసుకోవాడాన్ని భరించలేక మానస్తాపం చెంది తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోళ్లఫారం సూపర్‌ వైజర్‌ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ తెలిపారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా