దాడి చేసి అన్న ముక్కు కొరికేశాడు!

6 Apr, 2018 15:22 IST|Sakshi
పోలీసులు అదుపులో నిందితుడు శ్రీకాంత్‌( ఇన్‌సెట్‌లో ) బాధితుడు శోబ్రాన్‌

లక్నో : తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అన్నపై దాడి చేశాడో తమ్ముడు. సోదరుడి దాడిలో అన్నకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనౌజ్‌ జిల్లా రామ్‌లాల్‌పురాకు చెందిన శ్రీకాంత్‌ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అన్న శోబ్రాన్‌ వద్దకు వెళ్లి తాగడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. అందుకు సోదరుడు నిరాకరించడంతో అప్పటికే తాగిన మైకంలో ఉన్న శ్రీకాంత్‌, తన అన్న శోబ్రాన్‌ మీద పడి దాడిచేసి ముక్కు కొరికేశాడు.

ముక్కుకు తీవ్రగాయం కావడంతో నొప్పి భరించలేక శోబ్రాన్‌ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కటుంబసభ్యులపై కూడా శ్రీకాంత్ దాడి చేశాడు. హాస్పిటల్‌లో కోలుకుంటున్న శోబ్రాన్‌ మాట్లాడుతూ.. ‘తమ్ముడు మా అమ్మానాన్నలతో పాటు మావయ్యపై కూడా దాడికి పాల్పడ్డాడు. ముఖ్యంగా నాపై దాడిచేసి ముక్కు కొరికేశాడు. నా పొట్ట, చేతులపై కూడా దాడి చేసి గాయపరిచాడని’  వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు