మరదలితో అసభ్య ప్రవర్తన; బావకు బేడీలు

31 Oct, 2019 16:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మరదలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన బావను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ లింగస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేరెడ్‌మెట్, ఓల్డ్‌ సఫిల్‌గూడకు చెందిన శ్రీనివాసులు(38) కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అతడికి మరదలి వరుసయ్యే ఓ మహిళ భర్తతో మనస్పర్థలు రావడంతో ఉత్తంనగర్‌ ప్రాంతంలో తల్లితో కలిసి ఉంటోంది. నెల రోజులుగా శ్రీనివాసులు సదరు మహిళను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 28న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బుధవారం నిందితుడిని  అరెస్ట్‌ చేశారు.  

ప్రేమను తిరస్కరించినందుకు పరువు తీశాడు
ప్రేమను తిరస్కరించిందనే కోపంతో క్లాస్‌మేట్‌ వ్యక్తిగత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసి ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత్‌ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్లకు చెందిన మేడిశెట్టి శ్రీకాంత్‌ బాధితురాలితో పాఠశాల స్థాయి నుంచి కలిసి చదువుకున్నాడు. ఆ సమయంలో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె ఫొటోలు, ఆమె వ్యక్తిగత ఫొటోలను  తీశాడు. అయితే కొంతకాలంగా అమె బిజీగా ఉండటంతో శ్రీకాంత్‌తో మాట్లాడం మానేసింది.

తన ఫోన్‌కాల్స్‌కు స్పందించకపోవడంతో గత నెలలో వనస్థలిపురంలోని ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలి ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. తనతో పెళ్లి చేయాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. ఆ తర్వాత బాధితురాలు అతడి ఫోన్‌ ఎత్తకపోవడంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. గతంలో తన కెమెరాతో తీసిన పాత ఫొటోలను బయటికి తీసి తన ఫేస్‌బుక్‌ స్టేటస్‌లో పెట్టడమేగాక కామెంట్లు పెడుతూ ఆమె వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్‌ డాటా ఆధారంగా నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చంపేస్తావా ఏంటి.. మర్యాదగా మాట్లాడు’

హైదరాబాద్‌లో దారుణం..

‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’

ఐస్‌ ప్యాక్‌లో ప్రమాదకర డ్రగ్స్‌ నింపి...

యువతిపై బాలుడి అత్యాచారం.. !

ఫోన్లో నగ్న వీడియోలు తీసి.. ఎయిర్‌హోస్టెస్‌ నిర్వాకం

రూ.3 కోట్లతో నగలు కొన్న దేవికా రాణి

చెడు నడవడి.. చేతులు తెగిపడి

స్నేహం పేరుతో వ్యభిచార కూపంలోకి

మీడియా ముందుకు శశికుమార్‌, కీర్తి

ప్రాణాలు తీసిన వేగం

ఖమ్మంలో భారీగా పట్టుబడ్డ పాత నోట్ల కట్టలు

కీర్తి, శశికుమార్‌తో పాటు బాల్‌రెడ్డిని కూడా..

తండ్రిని చంపిన కొడుకు, కోడలు

నాన్నా నన్ను క్షమించు..  

బోగస్‌ ట్రావెల్‌ ఏజెన్సీ గుట్టురట్టు

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు

గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం

‘ట్రిమ్‌విజన్‌’ పేరిట 230 మందికి టోకరా

ప్రాణాలు తీసిన కోడి పందెం

విషాదం : కాలిపోతున్నా ఎవరూ పట్టించుకోలేదు

ఆర్టీసీ సమ్మె: ఆరెపల్లిలో విషాదం

స్పిన్నింగ్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

మహిళలకు అసభ్య వీడియో, ఎస్‌ఐపై వేటు

కైలాసగిరిపై గ్యాంగ్‌రేప్‌ యత్నం

టపాసులకు భయపడి పట్టాలపైకి

లారీలు, బస్సులున్నాయి ఇంకా పెళ్లికాలేదని..

కడసారి చూపు కోసం వెళ్లి...అంతలోనే!

ఆర్టీసీ బస్‌ ఢీకొని కండక్టర్‌ మృతి

మోసం కేసులో సినీ నిర్మాత అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

వేదికపై ఏడ్చేసిన నటి

‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

‘దేశ చరిత్రలోనే అలా అడిగిన వ్యక్తిని నేనే’

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!