'దేశాన్ని ర‌క్షించింది నాథూరాం గాడ్సే'

29 May, 2020 20:08 IST|Sakshi

భోపాల్‌: ఓ వ్య‌క్తి క‌రెన్సీ నోటు మీద మ‌హాత్మాగాంధీకి బ‌దులు గాంధీని హ‌త‌మార్చిన‌ నాథూరాం గాడ్సే ఫొటోను ఎడిట్ చేశాడు. అనంత‌రం దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు వారం రోజుల త‌ర్వాత‌ కేసు న‌మోదు చేసిన‌ ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది. వివ‌రాలు.. ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి ప‌రిష‌త్‌)కి చెందిన శివ‌మ్ శుక్లా మే 19న నాథూరాం గాడ్సే జ‌యంతిని పురస్క‌రించుకుని సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌ద‌ పోస్ట్ పెట్టాడు. (వీడియోలతో బ్లాక్‌ మెయిలింగ్‌..)

'నాథూరాం గాడ్సే వ‌ర్ధిల్లు గాక' అంటూ రూ.10 నోటుపై మ‌హాత్ముడి చిత్రానికి బ‌దులు నాథూరాం గాడ్సే ఉన్న చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. "దేశాన్ని నాథూరాం ర‌క్షించాడు" అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ(నేష‌న‌ల్ స్టూడెంట్స్ యూనియ‌న్ ఆఫ్ ఇండియా) పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప్ర‌స్తుతం నిందితుడు ప‌రారీలో ఉన్నాడ‌ని, అత‌ని కోసం గాలింపు చేప‌ట్టామ‌ని కొత్వాలీ సిధి పోలీస్ స్టేష‌న్ ఇన్‌చార్జ్ ఎస్ఎమ్‌ ప‌టేల్ తెలిపారు. (ఈ రోజు నా గడువు తీరిందని లేఖలో ..)

మరిన్ని వార్తలు