వ్యక్తి దారుణహత్య..!

5 Jun, 2019 08:01 IST|Sakshi
నెహ్రూ మృతదేహం ఘటనాస్థలిని పరిశీలిస్తున్న పోలీసులు

అనుమానం పెనుభూతమైంది.. తన భార్యతో స్నేహితుడు సఖ్యతగా మెలుగుతున్నాడని అనుమానం పెంచుకున్నాడు. అదునుకోసం వేచి చూసి మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతనితో సన్నిహితంగా మెలుగుతూనే హత్యకు పథకం రచించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నానని.. వైద్యుడితో చూపించుకోవాలని వెంట రమ్మని కోరాడు.. పథకం ప్రకారం స్నేహితుడికి పూటుగా మద్యం తాపించి ఆపై ఘాతుకానికి ఒడిగట్టాడు. మోటకొండూర్‌ మండలంలో మంగళవారం వెలుగుచూసిన హత్యోదంతం వివరాలు.. 

మోటకొండూర్‌ (ఆలేరు) : జగద్గిరిగుట్టకు చెందిన నెహ్రూ(45) పాబ్రికేషన్‌ వర్క్‌ చేస్తుంటాడు. సమీపంలో నివసించే వేముల పరుశరాములుతో కలిసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా చేస్తుంటాడు. రెండు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా స త్సంబంధాలు కొనసాగుతున్నాయి. అయితే నెహ్రూ తన భార్యతో సఖ్యతగా మెలుగుతున్నాడని ఇటీవల పరశరాములు అనుమానం పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

అనారోగ్యంతో బాధపడుతున్నానని..
 హత్యకు పథకం రచించిన పరుశరాములు స్నేహితుడైన నెహ్రూతో సఖ్యతగానే మెలుగుతున్నాడు. తనకు ఏమీ తెలియనట్టుగా అతడిని నమ్మిం చా డు. ఈ నేపథ్యంలోనే తనకు ఆరోగ్యం బాగాలేద ని పసిరికలు (కామెర్లు) అయ్యాయని చెట్ల మందులు తీసుకోవాలని, వైద్యుడి వద్దకు తీసుకెళ్లాల ని స్నేహితుడిని కోరాడు. దీనిలో భాగంగా నెహ్రూ సోమవారం సాయంత్రం స్నేహితుడు పరశరాములతో కలిసి జనగామ వైపు బయలుదేరాడు.
 
రాయగిరిలో మద్యం సేవించి..
షిఫ్ట్‌ డైజైర్‌ కారులు బయలుదేరిన స్నేహితులు భువనగిరి మండలం రాయగిరిలో మద్యం సేవించారు. అనంతరం పరుశరాములు స్వగ్రామం అ యిన మోటకొండూర్‌ మండలం తేర్యాల గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలోని చందేపల్లి గ్రామసమీపంలో వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారితోకి కొంతదూరం వెళ్లి రాత్రి 9గంటల సమయంలో మళ్లీ మద్యం సేవించారు. ఈ క్రమంలో పాత కక్షలను మనసులో ఉంచుకున్న పరుశరాములు నెహ్రూకు మద్యం అతిగా తాగించి స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం అప్పటికే కారులో ఉన్న కర్రను తీసుకొచ్చి నెహ్రూ తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

కిడ్నాప్‌ కేసు నమోదు
నెహ్రూ, పరశరాములు ఇద్దరు కలిసి వెళ్లి రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో నెహ్రూ భార్య సోమవారం రాత్రే జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దుచేసింది. తన భర్తను కిడ్నాప్‌ చేశారని  ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బావమరిదికి ఫోన్‌ చేసి..
హత్య అనంతరం పరశరాములు జరిగిన విషయాన్ని తన బావమరిదికి ఫోన్‌ చేసి చెప్పాడు. అతను పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం పరశరాములు మోటకొండూర్‌ మండల కేంద్రానికి వచ్చి మద్యం సేవించాడు. తెల్లవారుజామున మోటకొండూర్‌ పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం ఎస్‌ఐ వెంకన్న, శ్రీరాములు, ప్రభాకర్‌లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు జగద్గీరిగుట్ట పీఎస్‌లో నమోదు అవ్వటంతో ఎసీపీ గోవర్ధన్, ఎస్‌ఐ శ్రీనివాస్‌ , క్లూస్‌ టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు