చూశాడని..బైక్‌ను కాల్చేశాడు..

12 Jun, 2019 07:40 IST|Sakshi

లంగర్‌హౌస్‌: తనను ఎందుకు చూశావంటూ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి అటుగా వెళుతున్న వ్యక్తితో గొడవపడి అతని ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టిన సంఘటన లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, ఎస్సై కవియుద్దీన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీహార్‌కు చెందిన మనుకుమార్‌  నగరానికి వలసవచ్చి లంగర్‌హౌస్‌ లక్ష్మీనగర్‌లో ఉంటూ కార్పెంటర్‌ పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి అతను తన కుమార్తెకు మందులు తీసుకుని వచ్చేందుకు బైక్‌పై వెళుతుండగా అదే సమయంలో హకీంపేట్‌కు చెందిన సయ్యద్‌ అమీర్‌ లక్ష్మీనగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు రాజును కలిసి తిరిగి వెళుతూ మూత్ర విసర్జన కోసం ప్రధాన రహదారి పక్కన బైక్‌ ఆపాడు.

అదే సమయంలో అటు వెళుతున్న మను కుమార్‌ అతడిని చూసి ముందుకు వెల్లాడు. దీంతో అతడిని వెంబడించిన అమీర్‌ మార్కెట్‌ రోడ్డులోని కుతుబ్‌షాహి మసీదు వద్ద మను కుమార్‌ను అడ్డుకుని తనను ఎందుకు అలా చూశాంటూ గొడవ పెట్టుకున్నాడు. అనంతరం మను బైక్‌ కీ లాక్కుని  బలవంతవంగా తన బైక్‌పై ఎక్కించుకొని రాజు ఇంటికి తీసుకెళ్లాడు. రాజు అతడికి నచ్చజెప్పి మనుకు తాళం చెవి తిరిగి ఇప్పించి పంపాడు. దీంతో మను నేరుగా తన ఇంటికి వెళ్లి ఇంటి యజమానికి విషయం చెబుతుండగా గమనించిన అమీర్‌ మసీదు వద్ద నిల»ñబెట్టిన మను బైక్‌కు నిప్పంటించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమీర్‌ వాహనంతో పాటు, రాజు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ప్రియుడితో కలిసి కన్న తల్లే కసాయిగా..

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

అందుకే చచ్చిపోవాలనిపించింది

ప్రాణాలు తీసిన స్టాపర్‌

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

ప్రాణం తీసిన బిందె

మద్యం తాగి కాక్‌పిట్లో ప్రయాణం

ఐదేళ్ల చిన్నారిపై కీచకపర్వం

స్కెచ్చేశాడు.. చంపించాడు

అక్కాచెల్లెల్ని బంధించి రెండు నెలలుగా..

సీఎం పీఏ అంటూ..డబ్బులు డిమాండ్‌

కాగ్నిజెంట్‌ ఉద్యోగి ఆత్మహత్య

బాలికను వేధించిన వాచ్‌మెన్‌కు దేహశుద్ధి

ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమే...

రూ. 3.3 కోట్లు దోచేసి.. దర్జాగా..

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

తల ఛిద్రం; మోడల్‌ దారుణ హత్య

బాలుడి మృతి.. తల్లి పైనే అనుమానం...

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌

అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

గిద్దలూరు వాసి చిత్తూరులో ఆత్మహత్య

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువతి..

అంత్యక్రియల అనంతరం నిలదీస్తే.. ఒప్పుకొన్న భర్త

తల్లి జబ్బుపడిందని.. కుమార్తె ఆత్మహత్య

సాక్షి భయపడినట్టే.. కోర్టు ఆవరణలోనే ఘటన

తమ్ముడిపై కొడవలితో దాడి

పోలీసునంటూ షాపులో దౌర్జన్యం

యువకుడి మృతదేహం లభ్యం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం