'హలో పోలీసులా.. నేను ఫుల్లుగా తాగి నడుపుతున్నా'

9 Jan, 2018 12:37 IST|Sakshi

న్యూయార్క్‌ : అది కొత్త సంవత్సర ప్రారంభానికి కొన్ని ఘడియల ముందు. ఆ రోజు ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొని ఉండటంతోపాటు పార్టీలు, లైటింగ్‌ ఫెస్టివల్స్‌తో అంతటా రోడ్లపై కూడా బిజీబిజీగా గజిబిజిగా ఉంది. ఎక్కడ ఏ సంఘటన వినాల్సి వస్తుందో అనే పోలీసులంతా తమ కంట్రోల్‌ రూమ్‌ వద్ద చాలా అప్రమత్తంగా ఉన్నారు. వరుసగా ఫోన్‌లు వస్తూనే ఉన్నాయి. అదే సమయంలో మైఖెల్‌ లెస్టర్‌ అనే ఓ 35 ఏళ్ల వ్యక్తి నుంచి పోలీసుల అత్యవసర ఫోన్‌ నెంబర్‌ 911కు ఫోన్‌ వచ్చింది. అది లిఫ్ట్‌ చేసిన మహిళా పోలీసు అధికారిణి '911, మీ అత్యవసర పరిస్థితి ఏమిటి?' అని అడిగారు. వెంటనే బదులిచ్చిన మైఖెల్‌ నేను ఫుల్లుగా తాగి నా కారు నడుపుతున్నాను అని చెప్పాడు.

దాంతో అవాక్కయిన ఆమె వెంటనే తేరుకొని ఇప్పుడెక్కడ నుంచి సరిగ్గా మాట్లాడుతున్నావని ప్రశ్నింగా తనకు అదంతా అర్థం కావడం లేదని, ఎక్కడబడితే అక్కడ తిరుగుతున్నానని, అది కూడా రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తున్నానని తాఫీగా చెప్పాడు. దాంతో మరింత కంగారు పడిన ఆమె అతడి నుంచి వివరాలు రాబట్టేందుకు ఆమె ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు అతడు ఎవరికీ ఎలాంటి హానీ చేయకుండానే, తనకు హానీ కలగజేసుకోకుండానే కారును ఓ చోట ఆపేశాడు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దానికి సంబంధించిన ఆడియోను ఇప్పుడు అధికారులు విడుదల చేశారు. ఇది చూసైనా తాగి వాహనం నడిపేవారికి కనువిప్పు కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలా తాగి నడిపిన మైఖెల్‌ది ఫ్లోరిడా అని, ఇప్పటికే నాలుగుసార్లు అతడు ఇలా నేరాలు చేశాడని పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు