ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసి షాక్‌ తిన్నాడు!

13 Jun, 2020 09:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేసిన వ్యక్తిని నిలువునా దోచేశారు సైబర్‌ నేరగాళ్లు. దాదాపు 83 వేల రూపాయలను స్వాహా చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, చందివిల్లి రహెజా విహార్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగి కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్‌లో మద్యం ఆర్డర్‌ చేయాలనుకున్నాడు. ఇందుకోసం ఫేస్‌బుక్‌లో దొరికిన ఓ నెంబర్‌కు కాల్‌ చేశాడు. 4,500రూపాయల విలువ గల ఓ మద్యాన్ని కొనుగోలు చేసి, చెల్లింపుల విషయంలో వారు అడిగినట్లుగా క్రెడిట్‌ కార్డు వివరాలను చెప్పాడు. అయితే గంటలు గడుస్తున్నా మద్యం డోర్‌ డెలివరీ అవ్వలేదు. ( దివ్య చుట్టూ రక్కసి మూక! )

అనుమానం రావటంతో అకౌంట్‌లో డబ్బులు చెక్‌ చేసుకుని షాక్‌ తిన్నాడు. దాదాపు 82,500 రూపాయలు కట్‌ అయ్యాయి. మరింత డబ్బు కట్‌ అయ్యే అవకాశం ఉందని భావించిన అతడు బ్యాంకు ఫోన్‌ చేసి మిగిలిన డబ్బులు కట్‌ కాకుండా చేసుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి : దొంగ‌కి క‌రోనా.. స్వీయ నిర్భందంలో పోలీసులు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు