అందానికి ఫిదా అయ్యానంటూ.. ముంచేశాడు! 

4 Sep, 2019 06:20 IST|Sakshi

సాక్షి, కర్నూలు : మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తన వివరాలన్నీ వెబ్‌ సైట్‌లో పెట్టి ఓ యువతి మోసపోయింది. నంద్యాల వన్‌టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాలు.. చాగలమర్రికి చెందిన బొమ్మగారి హజీమాబూబ్‌బీ బీకామ్‌ పూర్తిచేసి, పట్టణంలోని ఓ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. మంచి వరుడి కోసం షాదీ డాట్‌ కామ్‌లో తన ఫొటోలు, సెల్‌ నంబర్‌ అప్‌లోడ్‌ చేసింది. దీంతో తన పేరు అజీమ్‌వసీర్‌ అని, తాను కాలిఫోర్నియాలో వైద్యునిగా పనిచేస్తున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు.

అందానికి ఫిదా అయ్యానంటూ సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు పెట్టాడు. ఒకసారి ఢిల్లీకి వస్తే తానూ వచ్చి చూసి వెళ్తానని గత నెలలో ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో యువతి  ఢిల్లీ వెళ్లి ఎయిర్‌పోర్ట్‌ బయట అతడి కోసం గంటల కొద్దీ ఎదురు చూసింది. చివరకు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అని రావటంతో నిరాశతో వెనుదిరిగింది. రెండు రోజుల తర్వాత ఫోన్‌చేసి 6 లక్షల డాలర్ల బహుమతి తీసుకొస్తుండగా పోలీసులు తనను అరెస్ట్‌ చేశారని, తనకు రూ.75 వేలు ఇస్తే పోలీసులకు చెల్లించి వచ్చేస్తానని నమ్మించడంతో బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బు జమచేసింది. అనంతరం కొద్ది నిమిషాల్లోనే అతడి ఫోన్‌ అందుబాటులో లేదని సమాధానం రావటంతో మోసపోయానని తెలుసుకుని వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది చదవండి : ప్రియుడితో ఏకాంతంగా ఉండటం భర్త చూడటంతో..

మరిన్ని వార్తలు