ప్రియుడి కోసం ప్రియురాలి గాలింపు

12 Jun, 2018 14:55 IST|Sakshi
మచ్చర్లలో గ్రామస్తులతో మాట్లాడుతున్న యువతి   

గూడూరు వరంగల్‌ : ప్రేమించిన యువకుడు తనను మోసం చేశాడంటూ ఓ యువతి సదరు యువకుడి గ్రామానికి చేరుకొని వాకబు చేసిన సంఘటన మండలంలోని మచ్చర్ల గ్రామంలో సోమవారం జరిగింది. బాధితురాలు సంగీత కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంగీత హైదరాబాద్‌లోని చైతన్య కాలేజీలో నర్స్‌గా పనిచేస్తుండగా ఏడాది క్రితం అదే కళాశాలలో పనిచేసిన పగిడిపాల వినోద్‌తో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో తామిద్దరం ప్రేమించుకున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని వినోద్‌ చెప్పాడని సంగీత తెలిపింది. గత మూడు నెలలుగా కనిపిం చకుండాపోయాడని పేర్కొంది. తిరిగి గత వారం రోజులుగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడని, నమ్మించే మాటలు చెబుతున్నాడని, చివరకు తన కు మరో అమ్మాయితో తల్లిదండ్రులు పెళ్లి కుది ర్చారని చెప్పాడని వివరించింది. దీంతో మచ్చర్లకు చేరుకుని అతడి గురించి వాకబు చేయగా మరో బాలికతో పెళ్లి నిశ్చయమైందని తెలిసినట్లు చెప్పింది.

తాను వినోద్‌కు రెండో భార్యగానైనా ఉంటానని, తనను నమ్మించి మోసం చేశాడని గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ఎదుట ఆందోళన వ్యక్తం చేసింది. విషయం తెలు సుకున్న పోలీసులు మచ్చర్ల గ్రామానికి చేరుకోగా ఆ యువకుడి తరఫు పెద్దమనుషులు ఆ యువతిని మరో చోటికి తరలించినట్లు తెలిసింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా బాధితురాలు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా