రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

12 Sep, 2019 07:07 IST|Sakshi

సాక్షి, చెన్నై :  నటుడు రాఘవ లారెన్స్‌ పేరుతో రూ.18 లక్షల మోసానికి పాల్పడిని వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ సేవా కార్యక్రమాల కోసం ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా లారెన్స్‌ ట్రస్ట్‌కు ఉపాధ్యక్షుడినని చెప్పి ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి ఒక వైద్య విద్యార్థికి తక్కువ ఖర్చుతో సీటు ఇప్పిస్తానని చెప్పి రూ.18 లక్షలు వసూలు చేశాడు. రామనాథపురం, చిన్నకడై వీధికి చెందిన అల్‌అమీన్‌ భార్య పత్తూన్‌ నిషా. వీరి కూతురు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో నీట్‌ పరీక్ష రాసింది. అందులో చాలా తక్కువ మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లు తెలిసింది.

కాగా కొన్ని నెలల క్రితం పత్తూన్‌ నిషా చిన్న కడై ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో తన కూతురి కోసం టిక్కెట్‌ కొనడానికి వెళ్లింది. అప్పుడక్కడ పని చేస్తున్న మహిళతో తన కూతురు మెడికల్‌ సీటు గురించి చెప్పింది. అక్కడే ఉన్న ప్రవీణ్‌కుమార్‌ పత్తూర్‌ నిషాకు తనను పరిచయం చేసుకుని, తాను నటుడు రాఘవ లారెన్స్‌ నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు ఉపాధ్యక్షుడినని చెప్పాడు. అంతే కాదు రాఘవ లారెన్స్‌ ట్రస్ట్‌ ద్వారా మీ అమ్మాయికి వూలూర్‌లోని వైద్య కళాశాలలో తక్కువ ఖర్చుతో సీటు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన పత్తూర్‌ నిషా ప్రవీణ్‌కుమార్‌ చెప్పిన బ్యాంక్‌ ఎకౌంట్‌కు మొదటి సారిగా రూ.4.5 లక్షలు పంపింది.

ఆ తరువాత హాస్టల్‌ వసతి, ఫీజు అంటూ ప్రవీణ్‌ బ్యాంక్‌ ఎకౌంట్‌కు మరికొంత డబ్బును  పంపారు. అలా మొత్తం పత్తూర్‌ నిషా నుంచి రూ.18 లక్షలు వసూలు చేసిన ప్రవీణ్‌కుమార్‌ ఆమె కూతురికి మెడికల్‌ సీటు ఇప్పించలేదు. దీంతో అనుమానం వచ్చి పత్తూర్‌ నిషా నటుడు రాఘవలారెన్స్‌ ట్రస్ట్‌ కార్యాలయానికి ఫోన్‌ చేసి విషయాన్ని చెప్పింది. వివరాలు విన్న ట్రస్ట్‌ నిర్వాహకులు ప్రవీణ్‌కుమార్‌ పేరుతో తమ ట్రస్ట్‌లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన పత్తూర్‌ నిషా తన భర్తతో కలిసి రామనాథపురం జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ ఓం ప్రకాశ్‌ మీనాక్షిని కలిసి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌ కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మేనమామ వేధిస్తున్నాడు.. నటి

పల్నాడులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త దారుణ హత్య

మోసపోయి.. మోసం చేసి..

రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు

ఈ నెల 25 వరకూ చింతమనేనికి రిమాండ్‌

జీతం కోసం వస్తే.. బ్రోతల్‌ హౌస్‌కు

వీడియో తీసి..బెదిరించి..ఆపై లైంగిక దాడి

‘అతడిపై హత్య కేసు కూడా ఉంది’

ఘరానా దొంగ మంత్రి శంకర్‌ మళ్లీ దొరికాడు

నగరంలో నేపాలీ గ్యాంగ్‌

ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్‌ మృతి 

ఆర్మీ ఉద్యోగి సతీష్‌ది హత్యే

ఆటోలో తీసుకెళ్లి.. వివాహితపై అత్యాచారం

ప్రజలకు చేరువగా పోలీస్‌ ఠాణాలు

విశాఖలో ప్రాణం తీసిన పబ్‌జీ

గంజాయి సిగరెట్‌ @ రూ.100

వలంటీర్‌పై టీడీపీ వర్గీయుల దాడి

పాఠశాలలో టీచర్‌ రాసలీలలు.. దేహశుద్ధి 

పండగకు వచ్చి.. ప్రాణాలు కోల్పోయారు

కొండగట్టు బస్సు ప్రమాదానికి ఏడాది

పసికందు మృతి.. గుట్టు చప్పుడు కాకుండా

మత్తుమందు ఇచ్చి నగలు దోపిడీ

బాలికపై అత్యాచారయత్నం

నెత్తురోడిన జాతీయ రహదారి: 24 మందికి తీవ్ర గాయాలు

ఇద్దరు దొంగలు అరెస్ట్‌: 159 గ్రాముల బంగారం స్వాధీనం

పెళ్లికి నిరాకరించిందని దాడి!

స్విగ్గీ పేరుతో మహిళకు కుచ్చుటోపీ

బ్యాంకులో బంగారం విడిపిస్తానని ఫైనాన్సియర్‌ను నమ్మించి..

కాపురానికి తీసుకెళ్లాలని ఆందోళన

చంపి బావిలో పడేశారని భర్తపై దాడి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

రాత్రులు నిద్రపట్టేది కాదు