దారుణం: టీవీ పెట్టమని అడిగినందుకు..

16 Jul, 2020 11:33 IST|Sakshi

చెన్నై : ఎనిమిదేళ్ల చిన్నారి. ఆడుతూ, పాడుతూ గడిపే జీవితం. ఓ రోజు పక్కింటి వారి ఇంటికి వెళ్లడం ఆ పాప పాలిట మృత్యుపాశంగా మారింది. వివరాల్లోకెళితే.. మూడో తరగతి చదువుతున్న చిన్నారి తన తల్లితోపాటు చెన్నైలోని తూటికోరిన్ జిల్లాలో నివసిస్తోంది. ఇంట్లో టీవీ‌ లేకపోవడంతో అప్పుడప్పుడు పక్కన వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూసేది. ఇలా బుధవారం కూడా బాలిక పొరిగింటి వారి ఇంట్లోకి టీవీ పెట్టమని ఆశగా అడిగింది. అయితే అప్పటికే ఆ ఇంటి యాజమాని తన తండ్రితో ఏదో విషయంలో గొడవ పడుతున్నాడు. అదే సమయంలో పాప టీవీ పెట్టమని అడగంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపిస్తూ  దారుణానికి ఒడిగట్టాడు. (పుట్టినరోజు డ్రెస్‌ కోసం బాలుడి ఆత్మహత్య)

బాలిక గొంతు కోసి చంపి ఆమె శవాన్ని ప్లాసిక్‌ డ్రమ్‌లో కప్పి మూత పెట్టాడు. అనంతరం తన ఇంటి సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మృతదేహాన్ని నీటిలో పడేశాడు. మృతదేహాన్ని నీటిలో పడేయం చూసిన ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీటి నుంచి చిన్నారి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం నిందితుడిని అతనికి సాయం చేసిన స్నేహితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపాను. పోక్సో చట్టం కింద నేరస్తునిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (అజయ్‌, శ్రావణిల ప్రేమ విషాదాంతం)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు