ప్రేమించిన యువతి అన్నయ్య అన్నదని..

3 May, 2019 06:17 IST|Sakshi
వెంకటేష్‌ (ఫైల్‌)

మనస్తాపంతో చెరువులో పడి యువకుడి ఆత్మహత్య

మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో ఘటన

మొయినాబాద్‌: ప్రేమించిన యువతి తనను అన్నయ్య అందని మనస్తాపం చెందిన ఓ యువకుడు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌ గ్రామానికి చెందిన మంగలి సత్తయ్యకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు వెంకటేష్‌(28) గ్రామంలోనే హెయిర్‌ సెలూన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బంధువుల అమ్మాయి ఒకరు వెంకటేష్‌తో చనువుగా ఉండేది. దీంతో కొంతకాలంగా ఆమెను ప్రేమించాడు. ఇటీవల ప్రేమ విషయాన్ని అమ్మాయికి చెప్పాడు. తనకు ప్రేమంటే ఇష్టం లేదని.. నిన్ను అన్నలా భావించానని యువకుడికి చెప్పింది.

దీంతో యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మానసికంగా కుంగిపోయిన వెంకటేష్‌ ఆ విషయాన్ని మాత్రం ఎవరికీ చెప్పలేదు. గురువారం మధ్యాహ్నం గ్రామానికి సమీపంలో ఉన్న గండిపేట చెరువు వద్దకు వెళ్లాడు. తన స్నేహితులకు ఫోన్‌చేసి ప్రేమ విషయం చెప్పి తాను చనిపోతున్నానని ఫోన్‌ కట్‌చేశాడు. స్నేహితులు చెరువు వద్దకు వెళ్లే సరికే చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు చెరువులో గాలించి అతన్ని మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!