భార్యతో గొడవ.. భర్త బలవన్మరణం

30 Aug, 2019 09:35 IST|Sakshi

సాక్షి, మోపాల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లి పోవడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకున్నాడు. రూరల్‌ ఎస్‌హెచ్‌వో ప్రభాకర్‌ కథనం ప్రకారం.. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని కాలూర్‌ గ్రామంలో బాశెట్టి లింగం(48) కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఐదురోజుల క్రితం భార్య సుజాత, కొడుకుతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న లింగం జీవితంపై విరక్తి చెంది దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారమందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు.

విడాకులు తీసుకుని.. జీవితంపై విరక్తి చెంది
రుద్రూర్‌: భర్తతో మనస్పర్థలతో విడాకులు తీసుకు న్న ఓ ఇల్లాలు.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. రుద్రూర్‌ మండల కేంద్రం లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై సురేశ్‌ కథనం ప్రకారం.. రుద్రూర్‌కు చెం దిన జల్లపురం స్రవంతి (26) మనస్పర్థలతో ఇటీవలే భర్త నుంచి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి విడాకుల గురించి ఆలోచనల్లో మునిగి పోయిన ఆమె.. జీవితంపై విరక్తి చెంది ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరే సుకుంది. స్రవంతి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మద్యానికి బానిసై..
గాంధారి: మద్యానికి బానిసై, అప్పుల పాలైన ఓ యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు. గాంధారి ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్వాపూర్‌ గ్రామానికి చెందిన పిట్ల శేఖర్‌ (28) మద్యానికి బానిసై గ్రామస్తులతో పాటు తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక బుధవారం సాయంత్రం గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతడ్ని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

లింగం మృతదేహం, శేఖర్‌ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్నేహితుడిని కసితీరా కత్తితో నరికేసింది..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దారుణ హత్య

ఉసురుతీసిన ఆక్వా సాగు

చెట్టుకు కట్టేసి.. చితకబాది..

ఎందుకింత కక్ష..!

ఫేస్‌బుక్‌ మర్డర్‌

400 మందికి ఢిల్లీ నివాసులుగా నకిలీ గుర్తింపు!

కశ్మీరీ యువతులను వివాహం చేసుకున్నందుకు

కలకలం రేపుతున్న వర్షిణి హత్య

నటిపై దాడి చేసిన రూమ్‌మేట్‌

దందాలు చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ ఏఎస్‌ఐ

వంశీకృష్ణ అరెస్టుకు రంగం సిద్ధం!

డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌లో పట్టుకున్నారని..

చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు

చెరబట్టబోయాడు.. చనిపోయింది!

ఆ మహిళకు అదేం బుద్ధి..

మంచిర్యాలలో భారీ అగ్ని ప్రమాదం

గోదావరిలో రెండు మృతదేహాలు

గర్భిణిని చేసిన తొమ్మిదివ తరగతి విద్యార్థి

ప్రతీకారంతో రగిలి అదును చూసి..

తొలిబండికి లారీ రూపంలో ప్రమాదం

ఎదురు ప్రశ్నిస్తే.. మరింత చితకబాదుతున్నాడు..!

మురుగు కాల్వలో పసికందు మృతదేహం

భార్యలపై కత్తితో దాడి చేసిన భర్త

వేడినీళ్లు పడి చిన్నారి మృతి

వివాదాస్పదంగా తాడికొండ ఎస్‌ఐ వైఖరి

మహిళకు సందేశాలు.. దర్శకుడి అరెస్ట్‌

అతడి కోసం విమానం ఎక్కి రాష్ట్రాలు దాటి వెళ్లింది...

ఒంటికి నిప్పంటించుకుని.. విలవిల్లాడుతూ..

అ‘మాయ’కుడు.. ‘మంత్రులే టార్గెట్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు