టిక్‌టాక్‌ వీడియోలు; రైలు కింద పడి..

10 Jun, 2020 15:21 IST|Sakshi

సాక్షి, అనంతపురం : గుత్తిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలమై ఓ విద్యార్థి ఆత్మహ్యకు పాల్పడ్డాడు. వివరాలు..  పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో కేఎమ్‌  రాము అనే విద్యార్థి బీఎస్సీ (డిగ్రీ) చదువుతున్నాడు. కొంత కాలంగా రాము ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనో వేదనకు గురైన రాము బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు లవ్‌ ఫెయిల్యూర్‌ పాటలకు టిక్‌టాక్‌ చేశాడు. ఈ వీడియోలను టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసిన అనంతరం రైలు కిందపడి రాము ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  (రెండో పెళ్లికి సిద్ధ‌మైన సీఎం కుమార్తె )

మరిన్ని వార్తలు