మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

14 Aug, 2019 06:42 IST|Sakshi
మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి

సాక్షి, బద్వేలు: కట్టుకున్న భార్య ప్రవర్తన సరిగా లేదని, నలుగురిలో అవమానంపాలు చేస్తుందన్న కారణంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. పట్టణంలోని నూర్‌బాషాకాలనీకి చెందిన అబ్దుల్‌గఫూర్, లక్ష్మిదేవిలకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రెండవ వాడైన బీగాల మస్తాన్‌వలి (34) ఓ రైస్‌మిల్లులో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈయనకు 13 ఏళ్ల కిందట ఆళ్లగడ్డకు చెందిన షమీనాతో వివాహమైంది. వీరికి అబ్దుల్‌గఫూర్, రియాజ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే సంవత్సరం నుంచి షమీనా ఇంటికి సమీపంలోని గౌస్‌పీర్‌ అలియాస్‌ మున్నా అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది.

విషయం మస్తాన్‌వలికి తెలియడంతో పద్ధతి మార్చుకోమని తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో నాలుగైదు సార్లు పంచాయితీ జరిపినప్పటికీ షమీనా ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం బక్రీదు పండుగ కావడంతో షమీనా ఇంటి పట్టున లేకుండా గౌస్‌పీర్‌ ఇంటికి వెళ్లి ఉండటంతో అప్పుడే ఇంటికి వచ్చిన మస్తాన్‌వలి తిరిగి షమీనాతో గొడవకు దిగాడు. ఈ సమయంలో షమీనా, గౌస్‌పీర్‌లు నీవు చనిపోతే మేమిద్దరం కలిసి ఉంటామని మస్తాన్‌వలికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గొడవను చుట్టుపక్కల వారందరూ గమనించడంతో పాటు కట్టుకున్న భార్య అవమానకరంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురై ఇంట్లోకి వెళ్లి బయటకు రాలేదు. మంగళవారం ఉదయాన్నే ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పక్కనే ఉంటున్న అన్న మహమ్మద్‌రఫీ ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. అర్బన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమ్ముడు ఆత్మహత్య చేసుకోవడానికి మరదలు షమీనా, గౌస్‌పీర్‌లే కారణమని మహమ్మద్‌రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తల్లి శవాన్ని చెత్తకుండిలో వేశాడు

‘అమ్మ’కానికి పసిబిడ్డ

పెన్నాలో నలుగురు గల్లంతు.. ఒకరు మృతి..!

క్రూరుడు; అక్క కళ్లు పీకేశాడు!

ప్రియురాలిపై గ్యాంగ్‌రేప్‌, ప్రియుడు ఆత్మహత్య 

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

నవ వధువు అనుమానాస్పద మృతి..!

దాడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం

చైన్‌ స్నాచింగ్‌ ఇరానీ గ్యాంగ్‌ పనే..

అడ్లూర్‌లో దొంగల హల్‌చల్‌ 

ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది

తమ్ముడిని రక్షించబోయిన అన్న కూడా..

శభాష్‌.. ట్రాఫిక్‌ పోలీస్‌

మంచినీళ్లు అడిగితే మూత్రం తాగించారు..

తమిళ బియ్యం పట్టివేత

తండ్రిని చంపిన భారత సంతతి వ్యక్తి

ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్‌..

బాలుడ్ని తప్పించబోయారు కానీ అంతలోనే..

జాతీయ ‘రక్త’దారి..

స్నేహితుడి ముసుగులో ఘాతుకం

పోలీసు స్టేషన్‌పై జనసేన ఎమ్మెల్యే దాడి

జీవితంపై విరక్తి చెందాం 

అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

విధి చిదిమేసింది! 

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

పొన్నాల సోదరి మనవడి దుర్మరణం

గోవుల మృతిపై విచారణకు సిట్‌ ఏర్పాటు

అక్కా తమ్ముళ్ల మధ్య ఎన్‌కౌంటర్‌..!

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో దంపతుల మధ్య వివాదం?

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’