ఏఎస్‌ఐ వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

30 Jul, 2019 20:37 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని తన్నీరు నాగరాజుగా గుర్తించారు. ఓ కేసు విషయంలో  ఏఎస్ఐ మురళీ కృష్ణ తనను వేధిస్తుండటంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నాగరాజు వెల్లడించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 14వ తేదిన నాగరాజుకు, అతని బాబాయికి మధ్య గొడవ జరిగింది. 16న పోలీసులు వీరిద్దరి మీద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగానే.. బాబాయి తనపై జాలమ్మ గుడి వద్ద హత్యాయత్నం చేసినట్లు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అయితే ఏఎస్‌ఐ మురళీ కృష్ణ తన ఫిర్యాదును పట్టించుకోకుండా.. తననే వేధింపులకు గురి చేస్తున్నాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు కూడా డిమాండ్‌ చేయటంతో భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించాడు.

మరిన్ని వార్తలు