సినిమా చూస్తూ వ్యక్తి మృతి

7 Oct, 2019 13:09 IST|Sakshi
ఉప్పే మురళీకృష్ణ మృతదేహం

పశ్చిమగోదావరి,ఏలూరు టౌన్‌: ఏలూరు వన్‌టౌన్‌లోని సత్యనారాయణ థియేటర్‌లో మ్యాట్నీ సినిమా చూస్తూ వ్యక్తి  మృతి చెందాడు. సినిమా ముగిసిన అనంతరం గమనించిన థియేటర్‌లోని సిబ్బంది యాజమాన్యానికి విషయాన్ని తెలియచేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు దెందులూరు మండలం వీరభద్రపురానికి చెందిన ఉప్పే మురళీకృష్ణ (45)గా గుర్తిం చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వా స్పత్రి  మార్చురీకి తరలించారు.

మరిన్ని వార్తలు