విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మృతి

3 Apr, 2018 12:02 IST|Sakshi
రాకేష్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ మృతదేహం  

పటాన్‌చెరు టౌన్‌: విద్యుత్‌ షాక్‌ తగిలి వ్యక్తి మృతిచెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామ శివారులోని మంగేష్‌ కుమార్‌ వద్ద బ్యాటరీ రీసైక్లింగ్‌ ఖార్కానలో ఉత్తర్‌ప్రదేశ్‌ జిల్లాకు బదోహికి చెందిన రాకేష్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ కూలీ పని చేసుకుంటూ అక్కడే నివసిస్తున్నాడు.

ఈ క్రమంలో సోమవారం ఉదయం రాకేష్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌(51) స్నానానికని సమీపంలో ఉన్న వ్యవసాయ బోరు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ నేలపై పడి ఉన్న కరెంట్‌ వైరు కాలుకు తగిలి షాక్‌ కొట్టింది. దీంతో అతడిని చికిత్స కోసం ఇస్నాపూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా రాకేష్‌ కుమార్‌ ఉపాధ్యాయ్‌ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు